సెమీస్‌లో కివీస్‌పై ఘన విజయం.. ఉమెన్స్ అండర్19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి టీమిండియా..

By Chinthakindhi RamuFirst Published Jan 27, 2023, 4:05 PM IST
Highlights

ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి టీమిండియా... సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం..

ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత మహిళా జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే బెంబేలు పెట్టించారు...

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అన్నా బ్రోనింగ్‌ (1 పరుగు) ని అవుట్ చేసిన మన్నత్ కశ్యప్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించింది. ఆ తర్వాతి ఓవర్‌లో ఎమ్మా మెక్‌లాడ్ (2 పరుగులు), తిటాస్ సదు బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది..

5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ మహిళా జట్టు. ఈ దశలో ఇసాబెల్లా గేజ్, ప్లిమ్మర్ కలిసి మూడో వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం అందించారు...

22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన ఇసాబెల్లా గేజ్, పర్శవి చోప్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యింది. 14 బంతుల్లో ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ ఇజ్ షార్ప్, పర్శవి చోప్రా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది...

3 పరుగులు చేసిన ఎమ్మా ఇర్విన్‌ని అవుట్ చేసిన పర్శవి చోప్రా.. 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. కేట్ ఇర్విన్ 2 పరుగులు చేయగా 32 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు చేసిన ప్లిమ్మర్, అర్చనా దేవి బౌలింగ్‌లో అవుటైంది. ప్రెగ్ లోగెన్‌బర్గ్ 4, కేలే నైట్ 12 పరుగులు చేసి రనౌట్ అయ్యారు. 

108 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి మెరుపు ఆరంభం దక్కింది. 3.3 ఓవర్లలో 33 పరుగులు చేసింది భారత జట్టు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన కెప్టెన్ షెఫాలీ వర్మ, అన్నా బ్రోయింగ్ బౌలింగ్‌లో అవుటైంది...

ఆ తర్వాత సౌమ్య తివారి, శ్వేతా సెహ్రావత్ కలిసి రెండో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. 26 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన సౌమ్య తివారి కూడా అన్నా బ్రోయింగ్ బౌలింగ్‌లో అవుటైంది...

ఓపెనర్‌గా వచ్చిన శ్వేతా సెహ్రావత్ 45 బంతుల్లో 10 ఫోర్లతో 61 పరుగులు చేయగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిషా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసింది. 

click me!