‘లెట్స్ గెట్ మ్యారీడ్’... ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తొలి సినిమా! హీరో ఎవరంటే...

By Chinthakindhi RamuFirst Published Jan 27, 2023, 12:35 PM IST
Highlights

‘జెర్సీ’ హరీశ్ కళ్యాణ్ హీరోగా ‘లెట్సె గట్ మ్యారీడ్’ సినిమా ప్రకటించిన ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్... హీరోయిన్‌గా ‘లవ్ టుడే’ ఇవానా.. 

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, సేంద్రీయ వ్యవసాయంపైనే ఫోకస్ పెట్టాడు. రాంఛీలో తన పొలంలో పండించిన పంటను దేశవిదేశాల్లో విక్రయిస్తున్న మాహీ, పాలు, పాల ఉత్పత్తులతో పాటు నల్ల కోడి కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారాన్ని కూడా చేస్తున్నాడు...

ధోనీ భార్య సాక్షి సింగ్ రావత్‌కి సినిమాలంటే అమితమైన ఆసక్తి. ఇంతకుముందు సీఎస్‌కేపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించిన సాక్షి సింగ్ ధోనీ, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే...

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది సాక్షి సింగ్. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్‌జీఎం’ (LGM) - Lets Get Married అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు...

We're super excited to share, Dhoni Entertainment's first production titled - !

Title look motion poster out now! pic.twitter.com/uG43T0dIfl

— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd)

ఈ సినిమాకి రమేశ్ తమిళ్‌మణి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీని ఫిక్షనల్‌ క్యారెక్టర్‌గా చూపిస్తూ ‘అధర్వ’ అనే గ్రాఫిక్ మూవీని రూపొందించాడు రమేశ్ తమిళ్‌మణి. తొలుత ఈ సినిమాలో ప్రియాంక మోహనన్‌ని హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ‘లవ్‌టుడే’ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇవానాని హీరోయిన్‌గా ఫైనల్ చేశారు...

ఈ సినిమాకి సాక్షి సింగ్ నిర్మాతగా వ్యవహరించనుంది. మహేంద్ర సింగ్ ధోనీ సమర్పకుడిగా ఉంటాడు. ధోనీకి, ఇవానకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా, తెలుగులోకి డబ్ అవ్వడం ఖాయం.  ‘సింధు సామవెల్లి’ సినిమాతో సినీ ఆరంగ్రేటం చేసిన హరీశ్ కళ్యాణ్, తెలుగులో ఉదయ్ కిరణ్‌తో కలిసి ‘జై శ్రీరాం’ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోవడంతో హరీశ్ కళ్యాణ్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. 

తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూనే తెలుగులో ‘కాదలి’ అనే సినిమాలో మరోసారి హీరోగా ప్రయత్నం చేశాడు. ఈ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే నాని హీరోగా రూపొందిన ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకుని (పెద్దయ్యాక) కనిపించి, చిన్న రోల్‌నే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తున్న హరీశ్ కళ్యాణ్, ఈ ఏడాది ‘నూరు కోడి వానవిల్’, ‘స్టార్’, ‘డీజిల్’ అనే మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. 2017లో తమిళ్‌ ‘బిగ్‌బాస్’ సీజన్ 1లో అడుగుపెట్టిన హరీశ్ కళ్యాణ్, ఫైనల్ చేరి రెండో రన్నరప్‌గా నిలిచాడు. 

click me!