టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా వరంగల్ మాజీ క్రికెటర్... బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ పొజిషన్లపై కూడా క్లారిటీ...

By Chinthakindhi RamuFirst Published Nov 12, 2021, 5:02 PM IST
Highlights

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే... త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న బీసీసీఐ...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీతో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసిన విషయం తెలిసిందే. రవిశాస్త్రితో పాటు ఆయనకు సహాయక సిబ్బందిగా వ్యవహరించిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్... మరోసారి కాంట్రాక్ట్ గడువు పొడగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు.. దీంతో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకోబోతుంటే ఆయనతో పాటు కొత్త బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌ని త్వరలోనే ప్రకటించనుంది బీసీసీఐ. 

బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన విక్రమ్ రాథోడ్, మరో రెండేళ్ల పాటు తన పదవిలో కొనసాగబోతున్నాడు. నాలుగేళ్లుగా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్, టీమిండియా హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డాడు. అయితే రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ, ఆ ఆలోచనను విరమించుకున్నాడు... బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు.

రాహుల్ ద్రావిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌‌గా ఉన్న సమయంలోనే పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించారు. గత జూలైలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి రాహుల్ ద్రావిడ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తే, పరాస్ మాంబ్రే టెంపరరీ బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు.

ఇది చదవండి: షాకింగ్: సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్న హార్దిక్ పాండ్యా... మునాఫ్ పటేల్, రాజీవ్ శుక్లాతో పాటు...

రాహుల్ ద్రావిడ్‌తో ఉన్న సానిహిత్యం దృష్ట్యా, పరాస్ మాంబ్రేని బౌలింగ్ కోచ్‌గా నియమించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఫీల్డింగ్ కోచ్ పొజిషన్ కోసం అభయ్ శర్మ, టీ దిలీప్ దరఖాస్తు చేసుకున్నారు. శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి దిలీప్ ఫీల్డింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో వరంగల్‌కి చెందిన టి దిలీప్ భారత జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటారని సమాచారం. 

అభయ్ శర్మతో పోలిస్తే వరంగల్ మాజీ క్రికెటర్ టి దిలీప్, ఫీల్డింగ్ కోచ్ పదవి స్వీకరించడానికి అవసరమైన మూడు లెవెల్ కోర్సుని పూర్తి చేయడంతో పాటు ఇండియా ఏకి, హైదరాబాద్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉండడంతో ఆయనకి కలిసి రానుంది. 

క్రికెట్ అడ్వైసరీ కమిటీలో సభ్యులుగా ఉన్న భారత మాజీ క్రికెటర్ ఆర్‌పీ సింగ్, సులక్షణ నాయక్, ఈ మూడు పొజిషన్‌లకి సంబంధించిన ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి ఈ కొత్త కోచింగ్ స్టాఫ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. 

నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కానుంది. దీనికి నాలుగు రోజుల ముందే నవంబర్ 14నే ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అందరూ జైపూర్‌లో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 

న్యూజిలాండ్‌తో మూడు టీ20, రెండు టెస్టు మ్యాచులు ఆడే భారత జట్టు, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. సౌతాఫ్రికా టూర్‌లో భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచులు ఆడుతుంది. టీ20 కెప్టెన్సీ నుంచి వీడ్కోలు తీసుకున్న విరాట్ కోహ్లీ, సఫారీ టూర్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు..

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

click me!