
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తండ్రయ్యాడు. గత కొంతకాలంగా నటాషా అనే నటితో ప్రేమలో ఉన్న హార్డిక్ పాండ్యా.. ఆమెతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. అయితే వీరికి వివాహం జరగకుండానే ఆమె గర్భం దాల్చడం, పండంటి బాబుకు జన్మనివ్వడం జరిగిపోయింది.
కొద్దిసేపటి క్రితమే తనకు కాబోయే భార్య బాబును ప్రసవించినట్లుగా హార్దిక్ ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరు సోషల్ మీడియాలో ఫోటోలు చేస్తున్నారు. గురువారం ఉదయం కూడా ఆమెతో ఉన్న ఫోటని హార్దిక్ పాండ్యా పోస్ట్ చేశాడు.
మరోవైపు పెళ్లికాకుండానే తండ్రి అయ్యావంటూ పలువురు అతనిని ఆటపట్టిస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు సైతం హార్దిక్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు.