IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. ప్రూఫ్ ఇచ్చిన వార్నర్ భాయ్

Published : Apr 03, 2022, 12:58 PM IST
IPL2022: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. ప్రూఫ్ ఇచ్చిన వార్నర్ భాయ్

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్ లో ఓ మ్యాచ్ గెలిచి  మరోదాంట్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త. ఆ జట్టుకు లోటుగా భావిస్తున్న ఇద్దరు కీలక ఆటగాళ్లు..  తర్వాత  మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నారు. 

ఐపీఎల్ లో ఈసారైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉన్న  ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ లో గెలిచినా  శనివారం గుజరాత్ తో జరిగిన పోరులో అపజయం పాలైంది. అయితే గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా ఆ జట్టుకు స్టార్ ప్లేయర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది.  ఆ జట్టు సుమారు  రూ. 6 కోట్లతో కొనుగోలు చేసిన డేవిడ్ వార్నర్ తో పాటు రిటెన్షన్ లో దక్కించుకున్న దక్కించుకున్న దక్షిణాఫ్రికా  పేసర్ ఆన్రిచ్ నోర్త్జ్ లు తర్వాత మ్యాచులకు అందుబాటులో ఉండే అవకాశముంది.  వీరితో పాటు  మరో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కూడా సెలక్షన్ కు అందుబాటులో ఉండే అవకాశముంది. 

ఢిల్లీ క్యాపిటల్స్  హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.  మ్యాచ్ అనంతరం పాంటింగ్ మాట్లాడుతూ.. నోర్త్జ్ గాయం నుంచి కోలుకున్నాడని తెలిపాడు. అతడి క్వారంటైన్ కూడా ముగిసిందని, ప్రస్తుతం అతడు నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి క్లీయరెన్స్ పొందగానే నోర్త్జ్ మైదానంలోకి దిగుతాడని పాంటింగ్ చెప్పాడు. నోర్త్జ్ తో పాటు ఆసీస్ ఓపెనర్, డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీతో కలిశాడని పాంటింగ్ వివరించాడు. ప్రస్తుతం పాంటింగ్ ముంబై చేరుకున్నాడని,  క్వారంటైన్ పూర్తి చేసుకున్న వెంటనే  తుది జట్టుతో కలుస్తాడని తెలిపాడు. 

 

కాగా..  శనివారం రాత్రే  ముంబైకి చేరుకున్న వార్నర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నేనెక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం...’ అని రాసుకొచ్చాడు.   పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ అనంతరం వార్న్ అంత్యక్రియల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిన వార్నర్.. అవి ముగిసిన (మార్చి 31) వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కాడు.  ప్రస్తుతం అతడు క్వారంటైన్ లో ఉన్నాడు. 

ఇదిలాఉండగా  పాక్ తో వన్డే సిరీస్ కు ముందు గాయంతో దూరమైన మిచెల్ మార్ష్ కూడా ఇటీవలే ఢిల్లీ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. అతడు క్వారంటైన్ ముగిసే దశలో ఉంది. గాయం కూడా పెద్దది కాకపోవడంతో అతడు కూడా తర్వాత మ్యాచులో అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది. 

 

శనివారం గుజరాత్ టైటాన్స్ తో 14 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్..  తమ తదుపరి పోరును ఈనెల 7న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది.  ఆ తర్వాత ఈ నెల 10న కోల్కతాతో తలపడాల్సి ఉంది.  లక్నోతో మ్యాచ్ నాటికల్లా వార్నర్, నోర్త్జ్ లు ఢిల్లీ తో కలిసే అవకాశముంది. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !