TATA IPL: ఏంటి డుప్లెసిస్ ఇది.. దానికి కూడా డీఆర్ఎస్సా..? ట్విట్టర్ లో సిరాజ్ పై పేలుతున్న జోకులు

Published : Mar 30, 2022, 10:30 PM IST
TATA IPL: ఏంటి డుప్లెసిస్ ఇది.. దానికి కూడా డీఆర్ఎస్సా..? ట్విట్టర్ లో సిరాజ్ పై పేలుతున్న జోకులు

సారాంశం

TATA IPL 2022 - RCB vs KKR: ఆర్సీబీ-కేకేఆర్ ల మధ్య జరుగుతున్న మ్యాచులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ  చెత్త  రివ్యూ తీసుకున్నందుకు గాను డుప్లెసిస్ ను ట్విట్టర్ లో నెటిజన్లు ఆడుకుంటున్నారు. అయితే  డుప్లెసిస్ ను ఆడుకున్నా ఫర్లేదు.. కానీ ఈ విషయంలో సిరాజ్ కు సంబంధమే లేదు. కానీ అతడిని కూడా... 

ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా  జరుగుతున్న  రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచులో బెంగళూరు బౌలర్లు  కట్టుదిట్టమైన బౌలింగ్ తో కేకేఆర్ వెన్ను విరిచారు.  ఆ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఈ క్రమంలో హర్షల్ పటేల్ వేసిన ఓ ఓవర్లో  ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ డీఆర్ఎస్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు బాల్ బ్యాట్ కు తగిలినప్పటికీ.. అది ప్యాడ్లకు దూరంగా వెళ్తున్నప్పటికీ డుప్లెసిస్ రివ్యూకు వెళ్లడం గమనార్హం. 

అసలు విషయానికొస్తే.. కేకేఆర్ ను తక్కువ పరుగులకే  కట్టడి చేసిన బెంగళూరు.. కేకేఆర్ ఇన్నింగ్స్ లో 16 ఓవర్ ను హర్షల్ పటేల్ విసిరాడు. అప్పటికే రెండు వికెట్లు తీసి ఫుల్ స్వింగ్ లో ఉన్న హర్షల్..  తన ఆఖరి బంతిని క్రీజులో ఉన్న  వరరుణ్ చక్రివర్తికి విసిరాడు. 

అయితే అది కాస్తా  బ్యాట్ కు తగిలి వన్ స్టెప్ అయి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చేతుల్లోకి వెళ్లింది. అయితే బంతి బ్యాట్ కు తాకడానికంటే ముందు వరుణ్ బూట్లకు తగిలిందేమోనన్న డౌటానుమానంతో హర్షల్ అంపైర్ వైపునకు తిరిగి అప్పీల్ చేశాడు.  అంపైర్ దానిని నాటౌట్ గా ప్రకటించాడు. 

 

ఇక్కడితో ఊరుకుంటే గొడవే లేకపోయేది. కానీ హర్షల్ కు ఏ మూలో అది వరుణ్ కాళ్లకు తాకి ఉంటుందని నమ్మకం. ఈ నమ్మకమే అతడిని కెప్టెన్ డుప్లెసిప్ వైపు చూసేలా ఉసిగొల్పింది. హర్షల్ చూడటమే తరువాయి.. డుప్లెసిస్ రివ్యూ కూడా తీసుకున్నాడు. అయితే రిప్లేలో బంతి  ఎక్కడా వరుణ్ బూట్లకు తాకినట్టు కనిపించలేదు. అది  బ్యాట్ కు తాకి కీపర్ వైపునకు  వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.  

దీంతో ట్విట్టర్ లో నెటిజన్లు  డుప్లెసిస్ ను ఆటాడుకుంటున్నారు.  బహుశా క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత చెత్త రివ్యూ అని  అంటున్నారు.   ఈ సందర్భంగా డుప్లెసిస్ తో పాటు సిరాజ్  పై కూడా జోకులు పేలుతున్నాయి. అదేంటి..? మధ్యలో సిరాజ్ ఎందుకొచ్చాడు..? అనే కదా మీ సందేహం.  ఇటువంటి  విషయాల్లో  డీఆర్ఎస్ లు తీసుకోమని అతడు తన కెప్టెన్లపై ఒత్తిడి తెస్తాడు. గతంలో ఇండియా తరఫున అతడు ఆడుతున్న మ్యాచులలో ఈ విషయాన్ని గమనించే ఉంటారు కదా. ఇప్పుడు అదే సిరాజ్ కు ఉన్న తొందరపాటు వ్యాధి  ఆర్సీబీ కెప్టెన్ కు కూడా అంటించాడని ఫ్యాన్స్  ఆగ్రహం   వ్యక్తం చేస్తున్నారు.

 

సిరాజ్ ను వెంటనే క్వారంటైన్ చేయాలని, లేకుంటే అతడు ఈ వ్యాధిని అందరికీ వ్యాపింపజేసే ప్రమాదముందని ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. అదేదో సినిమాలో అన్నట్టు హీరో, విలన్ కొట్టుకుంటే మధ్యలో సైడ్ ఆర్టిస్ట్ ను  దోషిని చేసినట్టు.. తనకు సంబంధమే లేని  విషయంలో పాపం సిరాజ్ బలవుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?