IPL 2022: సెహ్వాగ్ 'వడపావ్' ట్వీట్ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చిన వీరూ..

Published : Apr 07, 2022, 06:26 PM IST
IPL 2022: సెహ్వాగ్ 'వడపావ్' ట్వీట్ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చిన వీరూ..

సారాంశం

Virender Sehwag: కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో  చేతికందినట్టే అందిన విజయాన్ని ముంబై నుంచి లాగేసుకున్నాడు  ప్యాట్ కమిన్స్.  ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 

టీమిండియా మాజీ ఓపెనర్  వీరేంద్ర సెహ్వాగ్  ముంబై ఇండియన్స్  సారథి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. బుధవారం నాటి మ్యాచ్ ను ఉద్దేశిస్తూ.. వీరూ చేసిన ట్వీటే ఇందుకు కారణం.  మ్యాచ్ అనంతరం వీరూ  ట్విట్టర్ లో ప్యాట్ కమిన్స్  ఫోటో ను షేర్ చేస్తూ.. ‘నోటి కాడి వడపావ్ లాగేసుకున్నాడు’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్  హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు ఎక్కడో తాకింది. వీరూ.. హిట్ మ్యాన్ నే అన్నాడని ఊహించుకున్న అతడి అభిమానులు.. వీరూను ట్విట్టర్ లో కడిగిపారేసారు.  రోహిత్ శర్మను వడాపావ్ తో పోలుస్తారా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

ముంబై-కోల్కతా మ్యాచ్ అనంతరం వీరూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘నోటి కాడి వడపావ్ (ముంబైలో ఈ వంటకం చాలా ఫేమస్) లాగేసుకున్నాడు.  క్లీన్ హిట్టింగ్ కు ప్యాట్ కమిన్స్  అద్భుతమైన నిదర్శనం..’ అని ట్వీట్ చేశాడు. 15 బంతుల్లోనే 56 రన్స్ చేసిన కమిన్స్ ను ఉద్దేశిస్తూ వీరూ చేసిన ట్వీట్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగించింది. 

 

తమ అభిమాన ఆటగాడినే వీరూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడని  ఆరోపిస్తూ హిట్  మ్యాన్ ఫ్యాన్స్  సెహ్వాగ్ పై  ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో దుమ్మెత్తి పోశారు. ‘కమిన్స్ పూనకం వచ్చినోడిలా ఊగిపోయాడు.  దానికి రోహిత్ ఏం చేస్తాడు..?’, ‘ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన సారథిపై ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వీరూకు తగదు..’  అంటూ వీరూకు కౌంటర్ ఇచ్చారు. సెహ్వాగ్ పై  మీమ్స్, జోక్స్ తో ట్రోలింగ్ కు దిగారు.

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న వీరూ తిరిగి వారందరినీ సముదాయించే  ప్రయత్నం చేశాడు. మరో ట్వీట్ చేస్తూ... ‘వడపావ్ రిఫరెన్స్ అనేది ముంబైని ఉద్దేశించి. ముంబైలో వడపావ్ ఎంత పెద్ద వంటకమో మీకు నేను చెప్పాల్సిన పన్లేదు.  రోహిత్ శర్మకు మీకంటే నేను పెద్ద అభిమానిని..’ అని రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

ఇదిలాఉండగా  బుధవారం నాటి మ్యాచులో  తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని  అందుకుంది.  ఆ జట్టు తరఫున వెంకటేశ్ అయ్యర్ (50 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్ కు తోడు.. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ప్యాట్ కమిన్స్ (56) ముంబై బౌలర్లపై శివాలెత్తాడు.  ముఖ్యంగా డేనియల్ సామ్స్ వేసిన  16వ ఓవర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవర్లో ఆరు బంతుల్లో ఏకంగా 35 పరుగులు పిండుకున్నాడు. ముంబైకి వరుసగా మూడో అపజయాన్ని అందిస్తూ  ఆ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !