IPL 2022: పృథ్వీ షాందార్ షా.. మిడిల్ ఓవర్స్ లో డల్లైన ఢిల్లీ.. లక్నో ముందు ఈజీ టార్గెట్

Published : Apr 07, 2022, 09:19 PM ISTUpdated : Apr 07, 2022, 09:21 PM IST
IPL 2022: పృథ్వీ షాందార్ షా.. మిడిల్ ఓవర్స్ లో డల్లైన ఢిల్లీ.. లక్నో ముందు ఈజీ టార్గెట్

సారాంశం

TATA IPL 2022 - LSG vs DC: తొలి 8 ఓవర్లకు  ఢిల్లీ స్కోరు 68. కానీ తర్వాత  వరుసగా వికెట్లు కోల్పోవడమే గాక స్కోరు కూడా నెమ్మదించింది. అయితే ఆఖర్లో పంత్ ధాటిగా ఆడాడు. ఈ  ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్.. దారుణంగా విఫలమయ్యాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబై లోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న  ఐపీఎల్ 15వ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 149   పరుగులు చేసింది.  ఆరంభంలో ధాటిగా ఆడిన ఢిల్లీ.. మిడిల్ ఓవర్స్ లో వరుసగా వికెట్లు కోల్పోవడమే గాక  రన్ రేట్  కూడా తగ్గడంతో నెమ్మదించింది. అయితే ఆఖర్లో కాస్త ధాటిగా ఆడాలని యత్నించినా లక్నో బౌలర్లు మాత్రం  అందుకు అవకాశం ఇవ్వలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ లో పృథ్వీ షా ఆటే హైలైట్.  తన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) తర్వాత తిరిగి ఢిల్లీకి ఆడుతున్న  డేవిడ్ వార్నర్  అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.  లక్నో స్పిన్నర్లు ఢిల్లీని కట్టడి చేయడంలో సఫలమయ్యారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీకి ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (34 బంతుల్లో 61... 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. గత రెండు మ్యాచులలో పెద్దగా రాణించని షా..  లక్నో తో పోరులో మాత్రం చెలరేగి ఆడాడు.   కృష్ణప్ప గౌతమ్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన షా.. తర్వాత హోల్డర్ వేసిన మూడో ఓవర్లో మరో ఫోర్ తో పాటు సిక్సర్ బాదాడు. 

అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో కూడా వరుస బంతుల్లో 3 ఫోర్లు రాబట్టాడు.   షా రెచ్చిపోవడంతో తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికే ఢిల్లీ.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఇక ఏడో ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్ లో నాలుగో బంతిని కవర్స్ దిశగా ఆడిన షా.. 30 బంతుల్లోనే హాఫ్  సెంచరీ చేసుకున్నాడు.

ఇక కృష్ణప్ప వేసిన 8వ ఓవర్లో మొదటి బంతికి సిక్సర్ తర్వాత బంతికే ఫోర్ కొట్టిన షా.. మూడో బంతికి కీపర్ క్వింటన్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  షా ఔటయ్యేసరికి ఢిల్లీ స్కోరు 67 కాగా.. అందులో 61 పరుగులు అతడివే.  అప్పటికీ వార్నర్ స్కోరు 4 పరగులే అంటే పృథ్వీ షా విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే షా ఔటైన వెంటనే తర్వాత ఓవర్లో షాకిచ్చాడు రవి బిష్ణోయ్. అతడు వేసిన 9వ ఓవర్లో ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడిన వార్నర్ (12 బంతుల్లో 4).. పాయింట్ లో ఉన్న బదోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఐపీఎల్ లో వార్నర్ ఆడిన గత మూడు మ్యాచుల్లో బిష్ణోయ్ చేతుల్లో 3 సార్లు ఔటవడం విశేషం.  ఇక పదో ఓవర్లో బిష్ణోయ్..  రొమెన్ పావెల్ (3) కూడా వెనక్కి పంపాడు.   దీంతో తొలి 8 ఓవర్లలో 68 పరగులు చేసిన ఢిల్లీ.. తర్వాత 5 ఓవర్లలో 22 పరుగులే చేసింది.   

రిషభ్ పంత్  (36 బంతుల్లో 39 నాటౌట్.. 3 ఫోర్లు, 2 సిక్సులు), సర్ఫరాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 నాటౌట్.. 3 ఫోర్లు) లు వికెట్లు కాపాడుకునే దశలో  మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు.  16 వ ఓవర్ నుంచి పంత్ గేర్ మార్చాడు.  ఆండ్రూ టై వేసిన ఆ ఓవర్లో 4, 6, 6  తో 18 పరుగులు రాబట్టి  స్కోరుకు వేగం పెంచాడు. అవేశ్ ఖాన్ వేసిన 17వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్లో 13 పరగులొచ్చాయి. కానీ 18వ ఓవర్లో హోల్డర్ 6 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో అవేశ్ ఖాన్ 6, 20 ఓవర్లో హోల్డర్ 7 పరుగులిచ్చాడు.  మూడో వికెట్ కు పంత్-సర్ఫరాజ్ లు 57 బంతుల్లో 75 పరుగులు జోడించారు.  

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !