IPL 2022: డికాక్ సెంచరీ.. దంచికొట్టిన రాహుల్.. కేకేఆర్ ఎదుట భారీ లక్ష్యం..

By Srinivas MFirst Published May 18, 2022, 9:18 PM IST
Highlights

IPL 2022 LSG vs KKR:  ఐపీఎల్-15 లో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న లక్నో సూపర్  జెయింట్స్  తమ చివరి మ్యాచ్ ను విజయంతో ముగించేందుకు  రంగం సిద్ధం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆ  జట్టు.. ఓపెనర్లు వీర విహారం చేయడంతో భారీ స్కోరు చేసింది. 

ఐపీఎల్-15లో భాగంగా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే  తప్పక నెగ్గాల్సిన మ్యాచ్  లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు దారుణంగా విఫలమమయ్యారు.  గత రెండు మ్యాచులలో ఓటములతో కుదేలైన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు.. ఈ మ్యాచ్ లో  మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగారు.  లక్నో ఓపెనర్లు  క్వింటన్ డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్.. 10 ఫోర్లు, 10 సిక్సర్లు ) దంచికొట్టగా.. కెఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్.. 3 ఫోర్లు, 4 సిక్సర్లు)  కూడా రెచ్చిపోయి ఆడాడు. వీళ్లిద్దరూ కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ముఖ్యంగా డికాక్ వీరబాదుడుకు కేకేఆర్ బౌలర్లు కుదేలయ్యారు. ఈ ఇద్దరి దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో..  వికెట్లేమీ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు  అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.  కెఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ లు కలసి పోటీ పడి పరుగులు సాధించారు. ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ఆడారు. ఉమేశ్ యాదవ్ వేసిన 3వ ఓవర్లో రెండో బంతికి  అభిజిత్ తోమర్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన  డికాక్.. తర్వాత కేకేఆర్ బౌలర్లకు  చుక్కలు చూపించాడు. 

అప్పటికే ఓ సిక్సర్, రెండో ఫోర్లు కొట్టి డికాక్ ఊపుమీదుండగా.. ఉమేశ్ వేసిన ఐదో  ఓవర్లో 6, 4  తో జోరు  రాహుల్ కూడా జోరు పెంచాడు. సౌథీ వేసిన పదో ఓవర్లో  రాహుల్  వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. పది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు వికెట్ నష్టపోకుండా 83 పరుగులు. 

ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ మరింత రెచ్చిపోయి ఆడారు. ఇదే క్రమంలో వరుణ్ చక్రివర్తి వేసిన 12 వ ఓవర్లో సింగిల్ తీసిన డికాక్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఉమేశ్ వేసిన 14వ ఓవర్లో  ఐదో బంతికి సింగిల్ తీసి రాహుల్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు.రాహుల్ కు ఇది ఐపీఎల్ లో థర్డ్ ఫిఫ్టీ. 15 ఓవర్లకు లక్నో స్కోరు 122. 

హాఫ్ సెంచరీ అయ్యాక డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్లో 6, 6, 4 బాది ఎనభైల్లోకి చేరుకున్నాడు.   అనంతరం  రసెల్ వేసిన 18వ ఓవర్లో 6, 4 కొట్టి  59 బంతుల్లోనే సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. డికాక్ కు ఐపీఎల్ లో  ఇది రెండో సెంచరీ కావడం విశేషం.  ఇక సెంచరీ అనంతరం  సౌథీ వేసిన  19వ ఓవర్లో తొలి బంతికి  రాహుల్ సిక్సర్ బాదగా.. ఆఖరి మూడు బంతుల్లో 3 సిక్సర్లు బాదాడు డికాక్.  ఆఖరి ఓవర్లో కూడా డికాక్.. నాలుగు ఫోర్లు కొట్టి లక్నో స్కోరును  200 దాటించాడు. 

ఓపెనర్లే వీర బాదుడు బాదడంతో  లక్నో బ్యాటర్లు  సరికొత్త రికార్డు  సృష్టించారు. ఐపీఎల్  లో jకేకేఆర్ మీద అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్, డికాక్ లు కలిసి తొలి వికెట్ కు 210  పరుగులు జోడించారు.  ఐపీఎల్ లో ఇదే రికార్డు. అంతకుముందు.. రోహిత్ శర్మ -హెర్షల్ గిబ్స్ లు 2012లో ఇదే కేకేఆర్ మీద 167  పరుగులు జోడించారు. కాగా..  ఓపెనింగ్ వికెట్ కు కూడా ఈ ఇద్దరూ గతంలో సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-జానీ బెయిర్ స్టో లు కలిసి నెలకొల్పిన 185 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని బద్దలుకొట్టారు. 

click me!