IPL 2022: ఆర్సీబీతో సీఎస్కే కీలక పోరు.. ధోని మ్యాజిక్ పని చేసేనా..? టాస్ నెగ్గిన చెన్నై

Published : May 04, 2022, 07:09 PM ISTUpdated : May 04, 2022, 07:12 PM IST
IPL 2022: ఆర్సీబీతో సీఎస్కే కీలక పోరు.. ధోని మ్యాజిక్ పని చేసేనా..? టాస్ నెగ్గిన  చెన్నై

సారాంశం

TATA IPL 2022 RCB vs CSK: ఐపీఎల్ లో  సారథి మారాక సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముగిసిన మ్యాచ్ లో విజయాల బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. నేడు పూణే లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  కీలక పోరుకు సిద్ధమవుతున్నది. 

డిఫెండింగ్ ఛాంపియన్లు గా బరిలోకి దిగి  వరుస  పరాజయాలతో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే హైదరాబాద్ ను ఓడించి తిరిగి విజయాల బాట పట్టింది. ఇక వరుసగా మూడు మ్యాచులలో ఓడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తున్నది.  ఈ మేరకు ఇరు జట్ల మధ్య  పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో  ధోని  సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్  టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. 

పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరో స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్ రేసులో ముందున్న రాయల్ ఛాలెంజర్స్ కు ఈ మ్యాచ్ లో గెలవడం కీలకం. ఇక ప్లేఆఫ్  రేసులో నిలవాలంటే ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ లో చెన్నై గెలవాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్-2022 లో  భాగంగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కేనే విజయం వరించింది. 

ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఒక మార్పు జరిగింది. మిచెల్ సాంట్నర్ స్థానంలో  మోయిన్ అలీ బరిలోకి దిగుతున్నాడు.  ఆర్సీబీ జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్ కూడా ఆడుతున్నారు. 

 

తుది జట్లు: 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:  ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

చెన్నై సూపర్ కింగ్స్:  రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మోయిన్ అలీ,  రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్‌),  డ్వైన్ ప్రిటోరియస్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !