Rohit Sharma: ఆయనేదో చెప్తున్నాడు.. వినబడి చావట్లేదు.. సౌండ్ పెంచండి.. హిట్ మ్యాన్ విసుక్కున్న వేళ

Published : Apr 07, 2022, 04:20 PM IST
Rohit Sharma: ఆయనేదో చెప్తున్నాడు.. వినబడి చావట్లేదు.. సౌండ్ పెంచండి.. హిట్ మ్యాన్ విసుక్కున్న వేళ

సారాంశం

TATA IPL 2022: నిత్యం ప్రశాంతంగా కనిపించే రోహిత్ శర్మ.. వరుస పరాజయాలతో ఫ్రస్టేషన్ కు లోనవుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై 3 మ్యాచులాడగా మూడింటిలో ఓడింది.  బుధవారం రాత్రి కేకేఆర్ తో గెలవాల్సిన మ్యాచ్ లో కూడా ఓడటంతో... 

గ్రౌండ్ లో  ఎప్పుడూ కూల్ గా ఉంటూ తన పని తాను కానిచ్చే అతి కొద్ది మంది సారథులలో రోహిత్ శర్మ ఒకడు.  అతడు విసుక్కోవడం.. ఎదుటి వారిపై ఫ్రస్టేట్ అవడం చాలా అరుదు.  అయితే ఈ సీజన్ లో మాత్రం ఇప్పటివరకు ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా మూడు మ్యాచులకు గాను మూడింటిలో ఆ జట్టు ఓడింది.  ఇక బుధవారం పూణెలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో అయితే గెలవాల్సిన మ్యాచును చేజేతులా కోల్పోయింది ముంబై.  ప్యాట్ కమిన్స్ ఉగ్రరూపం  దాల్చడంతో ముంబై మునిగింది.  అయితే  తీవ్ర నిరాశకు గురైన హిట్ మ్యాన్ మ్యాచ్ అనంతరం విసుక్కున్నాడు. మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో అక్కడున్న సిబ్బందిపై  ఫ్రస్టేషన్ ను బయటపెట్టాడు. 

కేకేఆర్ తో మ్యాచ్ ముగిశాక  మాట్లాడటానికి వచ్చిన రోహిత్..   యాంకర్ డ్యానీ మోరిసన్ ప్రశ్న వినబడకపోవడంతో చిరాకు పడ్డాడు. ‘కాస్త సౌండ్ పెంచండి... వినబడటం లేదు..’ అని విసుక్కున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

ఇక ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనన్న హిట్ మ్యాన్.. ఈ  టోర్నీ లో ముందుకు సాగాలంటే  చేయాల్సింది చాలా ఉందన్నాడు. ‘వాస్తవానికి మాకు శుభారంభం దక్కలేదు. బౌలింగ్ లో కూడా మా ప్రణాళికలు అమలు చేయలేకపోయాం...’ అని  నిర్వేదంతో చెప్పాడు. ప్రతిసారి ఈ స్థానం (ఓడిపోయిన సారథి) లో ఉండాలనుకోవడం లేదని  నవ్వు రాని నవ్వుతో చెప్పుకొచ్చాడు. 

కమిన్స్ ఇలా ఆడతాడని అస్సలు ఊహించలేదు.. 

కేకేఆర్ విజయంలో  కీలక పాత్ర పోషించిన  ప్యాట్ కమిన్స్ ఆటపై రోహిత్ శర్మ  ప్రశంసలు కురిపించాడు.  కమిన్స్ ఇంత భాగా ఆడగలడని తాను అస్సలు ఊహించలేదని  తెలిపాడు. ‘కమిన్స్ ఇంత భాగా ఆడతాడని మేము ఊహించలేదు. కేకేఆర్ విజయం క్రెడిట్ మొత్తం అతడిదే. 15వ ఓవర్ దాకా ఆట మా చేతిలోనే ఉంది. కానీ ఆ తర్వాత కమిన్స్ అద్భుతం చేశాడు. మా  మ్యాచ్ ను కేకేఆర్ వైపునకు లాగేశాడు..’ అని  రోహిత్ తెలిపాడు. 

 

హిట్ మ్యాన్ చెప్పినట్టు.. బుధవారం నాటి మ్యాచ్ లో కేకేఆర్ విజయానికి క్రెడిట్ అంతా  కమిన్స్ దే.. ఇన్నింగ్స్ 14 వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన  అతడు.. ఆ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ తో  బాదుడు ప్రారంభించాడు. బుమ్రా వేసిన 14వ ఓవర్లో కూడా బౌండరీ, సిక్సర్ కొట్టాడు.  అప్పటికీ 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక  డేనియల్ సామ్స్ వేసిన  16వ ఓవర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు కమిన్స్. 6, 4, 6, 6, 2, 4, 6.. ఇలా సాగింది అతడి విధ్వంసం. ఆ ఓవర్లో ఆరు బంతుల్లో ఏకంగా 35 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 15 బంతులే ఆడ ఏకంగా 56 పరుగులు చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !