T20 Worldcup 2021: భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా... ఇంగ్లాండ్ సెమీస్ చేరాలంటే...

By Chinthakindhi RamuFirst Published Nov 6, 2021, 9:19 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్‌పై అత్యధిక స్కోరు నమోదుచేసిన సౌతాఫ్రికా... మార్క్‌రమ్ హాఫ్ సెంచరీ... 

టీ20 వరల్డ్‌కప్‌ 2021 గ్రూప్ 1 ప్లేఆఫ్స్ బెర్త్‌లను నిర్ణయించే మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు, ఇంగ్లాండ్ ముందు మంచి స్కోరు పెట్టగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగుల స్కోరు చేసింది. కీలక మ్యాచ్‌లో సఫారీ జట్టుకి శుభారంభం దక్కలేదు. 8 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రీజా హెండ్రిక్స్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా...

అయితే డి కాక్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి రెండో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వాన్ దేర్ దుస్సేన్, అయిడెన్ మార్క్‌రమ్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

క్రిస్ వోక్స్ వేసిన 16వ ఓవర్‌లో వాన్ దేర్ దుస్సేన్ వరుసగా రెండు సిక్సర్లు బాదగా, మార్క్‌రమ్ ఓ సిక్సర్ బాది 21 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత మార్క్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో 11 పరుగులు రాగా, క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి... మార్క్ వుడ్ వేసిన 19వ ఓవర్‌లో కూడా 13 పరుగులు వచ్చాయి...

Read: ఒకే రకమైన పొజిషన్‌లో టీమిండియా, విండీస్‌... టీ20ల్లో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి...

సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చాకచక్యంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర ఒత్తిడికి గురై ఇంగ్లాండ్ జట్టు ఫీల్డర్లు చేసిన తప్పిదాలు కూడా సఫారీలకు కలిసి వచ్చాయి. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు మార్క్‌రమ్.  మార్క్‌రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 60 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో జోస్ బట్లర్ 101 నాటౌట్‌ తర్వాత దుస్సేన్ చేసిన 94 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. టీ20 వరల్డ్‌ కప్ టోర్నీల్లో హర్షల్ గిబ్స్ 90, తిలకరత్నే దిల్షాన్ 96, మహేళ జయవర్థనే 98 నాటౌట్, లూక్ రైట్ 99 నాటౌట్‌ తర్వాత 90+ పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రస్సీ వాన్ దేర్ దుస్సేన్... 

Read also: రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టుపై ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా సెమీస్‌కి చేరాలంటే ఇంగ్లాండ్ జట్టును 130 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉంటుంది. 130లోపు ఇంగ్లాండ్‌ పరిమితమైతే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరతాయి. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు 86 పరుగుల కంటే తక్కువ స్కోరు చేస్తే... సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి చేరుకుంటాయి. 

click me!