T20 worldcup 2021: ఇరగదీసిన రోహిత్, రాహుల్... హార్దిక్, రిషబ్ మెరుపులు... టీమిండియా భారీ స్కోరు...

By Chinthakindhi RamuFirst Published Nov 3, 2021, 9:22 PM IST
Highlights

India vs Afghanistan: నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసిన టీమిండియా... రోహిత్, కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో లేట్ అయినా లేటెస్ట్‌గా ఫామ్‌లోకి వచ్చారు భారత బ్యాట్స్‌మెన్. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో విఫలమైన భారత బ్యాట్స్‌మెన్.,. పసికూన ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగుల భారీ స్కోరు చేసింది...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేశారు. ముందు రెండు మ్యాచుల్లో చేసిన తప్పులు చేయకుండా సింగిల్స్ తీస్తూ, అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కరీం జనత్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ిచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, గుల్బాదిన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాత రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా కలిసి మెరుపులు మెరిపించారు. హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 13 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. 

Read also: అతని కంటే సూర్యకుమార్ యాదవ్ చాలా బెటర్... భారత మాజీ కెప్టెన్ ఆశీష్ నెహ్రా కామెంట్స్...


ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అతి పెద్ద స్కోరు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియాకి ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

మొదటి వికెట్‌కి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి నిర్మించిన 140 పరుగుల భాగస్వామ్యం, విదేశాల్లో రెండో అత్యుత్తమ పార్టనర్‌షిప్. ఇంతకుముందు టీ20ల్లో రోహిత్, ధావన్ కలిసి 160 పరుగులు జోడించారు...
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టుకి 100+ ఓపెనింగ్ భాగస్వామ్యం రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌పై గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఆ రికార్డు క్రియేట్ చేశారు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ. 

Read this: మీరు ఎలా ఉంటే మాకెందుకు, సరిగా ఆడి చావండి... టీమిండియా పర్ఫామెన్స్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు...

రోహిత్ శర్మకు టీ20 వరల్డ్‌కప్ కెరీర్‌లో ఏడో హాఫ్ సెంచరీ. 2014 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో మొదటిసారి హాఫ్ సెంచరీ మార్కు దాటాడు రోహిత్ శర్మ. ఓవరాల్‌గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (10 హాఫ్ సెంచరీలు), క్రిస్ గేల్ 9 సార్లు 50+ తర్వాతి స్థానంలో నిలిచాడు రోహిత్...

వన్డే, టీ20ల్లో కలిపి వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును (18 సార్లు) సమం చేశాడు రోహిత్ శర్మ... కెఎల్ రాహుల్, రోహిత్ శర్మల మధ్య ఇది నాలుగో శతాధిక భాగస్వామ్యం. పాక్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ ఐదుసార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నారు.

click me!