T20 Worldcup 2021: మరోసారి టాస్ ఓడిన విరాట్ కోహ్లీ... ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ...

By Chinthakindhi RamuFirst Published Nov 3, 2021, 7:08 PM IST
Highlights

T20 Worldcup 2021: వరుసగా మూడు మ్యాచుల్లోనూ టాస్ ఓడిన విరాట్ కోహ్లీ... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో విరాట్ కోెహ్లీ హ్యాట్రిక్ పూర్తిచేసుకున్నాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో టాస్ ఓడిన విరాట్, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ సీన్ రిపీట్ చేశాడు.టీమిండియా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

తొలి రెండు మ్యాచుల్లో ఓడిన భారత జట్టుకి ఈ మ్యాచ్‌లో భారీ విజయం అందుకోవడం అత్యంత ఆవశ్యకం. నేటి మ్యాచ్‌లో ఓడితే భారత జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుని, ఆఫ్ఘాన్‌కి అవకాశాలు మెరుగవుతాయి.

మరోవైపు మూడు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న ఆఫ్ఘాన్‌కి కూడా ఈ విజయం అత్యంత అవసరం. నేటి మ్యాచ్‌లో ఓడితే ఆఫ్ఘాన్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది...
గత రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఈ మ్యాచ్‌లోనూ దాన్ని రిపీట్ చేశాడు.

Read also: అతని కంటే సూర్యకుమార్ యాదవ్ చాలా బెటర్... భారత మాజీ కెప్టెన్ ఆశీష్ నెహ్రా కామెంట్స్...

ఈ మ్యాచ్‌తో కలిపి వరుసగా ఆరో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడిపోయాడు విరాట్ కోహ్లీ. గత 9 టీ20 మ్యాచుల్లోనూ భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయడం మరో విశేషం. గత మ్యాచ్ ఫలితం ప్రభావంతో భారత జట్టులో మరోసారి రెండు మార్పులు చేశారు...

గత మ్యాచ్‌లో వెన్ను నొప్పి కారణంగా జట్టుకి దూరమైన సూర్యకుమార్ యాదవ్, తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే టీ20 వరల్డ్‌ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు దక్కింది.

మొదటి రెండు మ్యాచుల్లో వికెట్ తీయకపోవడమే కాకుండా, భారీగా పరుగులు సమర్పించిన వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు కరువైంది. అలాగే గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఇషాన్ కిషన్ కూడా జట్టుకి దూరమయ్యాడు..

2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. నాలుగేళ్ల తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు రవి అశ్విన్.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు 16 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఆ ప్రభావం వారి రన్‌రేట్‌పై పడింది. స్కాట్లాండ్ చూపించిన పోరాటం కారణంగా భారత జట్టుకి అవకాశాలు మరింత మెరగయ్యాయి.

అయితే భారత జట్టు భారీ విజయాలతో పాటు ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిపైనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆఫ్ఘాన్ జట్టు ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేసింది...

Read this: మీరు ఎలా ఉంటే మాకెందుకు, సరిగా ఆడి చావండి... టీమిండియా పర్ఫామెన్స్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు...


భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: మహ్మద్ షాజాద్, మహ్మద్ నబీ, హజ్రతుల్లా జిజాయ్, రహ్మనుల్లా గుర్బాజ్, నజీముల్లా జాద్రాన్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్,  షరఫుద్దీన్ అష్రఫ్, కరీం జనత్, హమీద్ హసన్

click me!