టీ20 వరల్డ్ కప్ 2022: మరోసారి టాస్ గెలిచిన రోహిత్ శర్మ... పసికూనతోనూ పూర్తి జట్టుతో...

By Chinthakindhi Ramu  |  First Published Oct 27, 2022, 12:32 PM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత శర్మ... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగిన జట్టుతోనే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనున్న భారత జట్టు...


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా నేడు భారత జట్టు, నెదర్లాండ్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే మైదానంలో గురువారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై 104 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో రోహిత్ శర్మ కూడా తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపాడు...

టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా, నేటి మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్... అయితే పాక్‌తో జరిగిన జట్టునే తిరిగి కొనసాగించింది భారత జట్టు. దీంతో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి రిజర్వు బెంచ్‌కే పరిమితం కానున్నారు. 

Latest Videos


మరోవైపు క్వాలిఫైయర్స్‌లో యూఏఈ, నమీబియాలను ఓడించిన నెదర్లాండ్స్... శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడిన నెదర్లాండ్స్ 9 పరుగుల తేడాతో ఓడింది...

ఒకే రోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రెండు మ్యాచులు షెడ్యూల్ చేయడం, బంగ్లాదేశ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా పూర్తి కావడం... భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్‌పై ప్రభావం చూపింది. షెడ్యూల్ ప్రకారం 12 గంటలకు జరగాల్సిన టాస్, మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత 12:35 గంటలకు జరిగింది...   మ్యాచ్ 12:50కి ప్రారంభం కానుంది.

2011 వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడిన భారత జట్టు, 11 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ టోర్నీలో ఆ జట్టుతో తలబడుతోంది.

నెదర్లాండ్స్ జట్టు: విక్రమ్‌జీత్ సింగ్, మ్యాక్స్ ఓడోడ్, బస్ దే లీడ్, కోలిన్ అకీర్‌మన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్, టిమ్ ప్రింగెల్, లోగన్ వాన్ బ్రీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకీరెన్ 

భారత జట్టు: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ 

click me!