టీ20 వరల్డ్ కప్ 2022 ఎఫెక్ట్... వెస్టిండీస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నికోలస్ పూరన్...

By Chinthakindhi RamuFirst Published Nov 22, 2022, 10:29 AM IST
Highlights

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో స్కాట్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో ఓడి క్వాలిఫైయర్స్ స్టేజీ కూడా దాటలేకపోయిన వెస్టిండీస్... నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నికోలస్ పూరన్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వెస్టిండీస్ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన విండీస్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది.ఆ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అసోసియేట్ దేశాలతో కలిసి క్వాలిఫైయర్స్ ఆడాల్సి వచ్చింది...

కిరన్ పోలార్డ్ రిటైర్ అవ్వడం, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, క్రిస్ గేల్ వంటి సీనియర్లను పక్కనబెట్టడంతో వెస్టిండీస్ జట్టు... క్వాలిఫైయర్స్‌లో కష్టాలు ఎదుర్కొంది. స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 118 పరుగులకి ఆలౌట్ అయ్యింది వెస్టిండీస్... 

ఆ తర్వాత ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనూ విండీస్ జట్టుకి పరాజయమై ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది ఐర్లాండ్... వరుసగా రెండు పరాజయాలు అందుకున్న వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో మంచి విజయం అందుకుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయింది వెస్టిండీస్.. 

ఈ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నాడు నికోలస్ పూరన్.  కిరన్ పోలార్డ్‌ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వెస్టిండీస్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న నికోలస్ పూరన్, కెప్టెన్‌గా ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో టీ20 సిరీస్ నెగ్గాడు...

‘ఎన్నో ఆశలతో కెప్టెన్సీ తీసుకున్నాను, అయితే టీ20 వరల్డ్ కప్ ఫలితం నన్ను ఎంతగానో నిరాశపరిచింది. కెప్టెన్‌గా నా దేశాన్ని గెలిపించడానికి నేను చేయాల్సిందంతా చేశాను. టీ20 వరల్డ్ కప్‌ పరాభవానికి కారణాలు చెప్పలేను. ఇలా మధ్యలో వదిలేయడం నా తత్వం కాదు. ఇప్పటికే వెస్టిండీస్ జట్టుకి కెప్టెన్సీ చేయడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. 

అయితే నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నాకూ, వెస్టిండీస్ జట్టుకి మంచి చేస్తుందని అనుకుంటున్నా. ఓ ప్లేయర్‌గా బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుంది. సీనియర్ ప్లేయర్‌కి జట్టుకి అన్ని విధాలా ఉపయోగపడేందుకు, సహాయ పడేందుకు కట్టుబడి ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు నికోలస్ పూరన్...

ఈ ఏడాది వెస్టిండీస్ జట్టు వైట్ బాల్ సిరీస్ ఏదీ ఆడడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది వెస్టిండీస్. నాలుగు నెలల సమయం ఉండడంతో వెస్టిండీస్ తర్వాతి కెప్టెన్ ఎవరనేది నిర్ణయించేందుకు విండీస్ క్రికెట్ బోర్డు దగ్గర కావాల్సినంత సమయం ఉంది.. 

click me!