నటరాజన్ సర్జరీ పూర్తి.. మళ్లీ తిరిగొస్తానంటూ ట్వీట్..!

Published : Apr 28, 2021, 09:20 AM ISTUpdated : Apr 28, 2021, 09:24 AM IST
నటరాజన్ సర్జరీ పూర్తి.. మళ్లీ తిరిగొస్తానంటూ ట్వీట్..!

సారాంశం

ఆ సర్జరీ విజయవంతంతగా పూర్తయినట్లు తాజాగా నటరాజన్ పేర్కొన్నాడు. ఆస్పత్రి బెడ్ పై కూర్చొని.. విజయసంకేతం చూపిస్తూ.. త్వరలోనే తిరిగి వచ్చేస్తానంటూ ట్వీట్ చేశాడు

టీమిండియా యువ క్రికెటర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు నటరాజన్... ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన వైద్యులు మోకాలికి సర్జరీ చేశారు.  ఆ సర్జరీ విజయవంతంతగా పూర్తయినట్లు తాజాగా నటరాజన్ పేర్కొన్నాడు. ఆస్పత్రి బెడ్ పై కూర్చొని.. విజయసంకేతం చూపిస్తూ.. త్వరలోనే తిరిగి వచ్చేస్తానంటూ ట్వీట్ చేశాడు

"  నా మోకాలికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నా సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్‌ టీమ్‌, సర్జన్స్‌, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కుకు కృజజ్ఞతలు. ఇక నా సర్జరీ విజయవంతం కావాలని విష్‌ చేసిన బీసీసీఐకి, అభిమానులు, నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. వీలైనం త్వరగా ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి దిగుతా. మీ మద్దతు, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని " అని నట్టూ పేర్కొన్నాడు. 

ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన నట్టూ.. తొలుత బెంచ్‌కు పరిమితమయ్యాడు. కానీ సర్జరీ చేయాల్సిందేనని నిపుణులు తేల్చడంతో అతను అర్థాంతరంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సర్జరీ చేసుకున్న నట్టూకు తగిన విశ్రాంతి అవసరం. ఈ లెక్కన అతను ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఆడటం కష్టమేనని తెలుస్తోంది. కాగా.. నటరాజన్ లేని లోటు.. సన్ రైజర్స్ జట్టులో స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?