ప్రకృతి కూడా ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తోందా... ఏబీడీ సిక్సర్ల సునామీ తర్వాత ఇసుక తుఫాన్...

Published : Apr 27, 2021, 10:30 PM IST
ప్రకృతి కూడా ఆర్‌సీబీకి సపోర్ట్ చేస్తోందా... ఏబీడీ సిక్సర్ల సునామీ తర్వాత ఇసుక తుఫాన్...

సారాంశం

ఏబీ డివిల్లియర్స్ మెరుపు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఇసుక తుఫాన్... ఈదురు గాలుల కారణంగా ఆటకు కాసేపు అంతరాయం... ప్రకృతి కూడా రాయల్ ఛాలెంజర్స్‌కి సహకరిస్తోందంటున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లో అదరగొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడినా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన ఆర్‌సీబీ, దాదాపు విజయం దిశగా సాగుతోంది.

అయితే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్‌పైన ఉండే తేమ కారణంగా బౌలింగ్, ఫీల్డింగ్ కష్టమవుతుందని, ఈజీగా పరుగులు చేయొచ్చని చెప్పాడు రిషబ్ పంత్. అయితే ప్రకృతి కూడా ఆర్‌సీబీకి అనుకూలంగా స్పందించింది.

ఏబీ డివిల్లియర్స్ ధనాధాన్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్టేడియంలో ఒక్కసారిగా ఇసుక తుఫాన్ వచ్చింది. ఈదురు గాలులు రావడంతో మ్యాచ్‌కి కాసేపు అంతరాయం కలిగింది. ఈ ఇసుక తుఫాన్ కారణంగా పిచ్‌పై తేమ ప్రభావం తగ్గి, బౌలర్లకు సహకరించే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఏబీ డివిల్లియర్స్ ఆడుతున్నప్పుడు లేదా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఇసుక తుఫాన్ వచ్చి ఉండవచ్చు. కానీ సరిగ్గా ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఇసుక తుఫాన్ రావడం అంటే ప్రకృతి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సహకరిస్తోందని అంటున్నారు అభిమానులు.

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్