గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌కి విరాళం ప్రకటించిన కేకేఆర్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్...

Published : Apr 27, 2021, 07:34 PM IST
గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌కి విరాళం ప్రకటించిన కేకేఆర్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్...

సారాంశం

కరోనా బాధితుల సహాయార్థం గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌కి తనవంతు ఆర్థిక సాయం ప్రకటించిన గుజరాత్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్... ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న గుజరాత్ వికెట్ కీపర్...  

ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ తర్వాత కరోనా విపత్తుతో పోరాడుతున్న భారత ప్రజలకు సాయం చేసేందుకు సౌరాష్ట్ర క్రికెటర్ షెల్డన్ జాక్సన్ ముందుకొచ్చాడు. కరోనా బాధితుల సహాయార్థం పనిచేస్తున్న గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌కి తనవంతు ఆర్థిక సాయం ప్రకటించాడు గుజరాత్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్. 

‘ఈ కష్టకాలంలో దేశానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. ఈ పరిస్థితి త్వరగా పోయి, మంచి రోజులు రావాలని కోరకుంటున్నా. దయచేసి ఇంట్లోనే ఉండండి, మాస్క్ ధరించండి... వీలైనంత ఎక్కువ మందికి సాయం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తున్న గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌కి నా వంతు విరాళం అందచేశాను.

మీకు కూడా వీలైనంత సాయం చేయండి. కోవిద్ 19తో పోరాడేందుకు ప్రతీ రూపాయి అవసరం అవుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు షెల్డన్ జాక్సన్.

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న షెల్డన్ జాక్సన్, ఇప్పటిదాకా 76 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 5634 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ అయిన జాక్సన్‌కి తుదిజట్టులో ఇప్పటిదాకా చోటు దక్కలేదు.

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?