
వెస్టిండీస్‌తో (india vs west indies) ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా (team india) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా విండీస్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడంతో వరుసగా మరో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అంతకుముందు రోహిత్ సేన వెస్టిండీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా మూడో సిరీస్‌ను వైట్ వాష్ చేసిన కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇదిలా ఉంటే, ఆఖరి టీ20లో సూర్యకుమార్ యాదవ్ (65) (surya kumar yadav) వీరవిహారం చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. వెంకటేశ్ అయ్యర్ ( 35 నాటౌట్)తో కలిసి చివరి 5 ఓవర్లలో బ్యాట్ ఝళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ క్రమంలో సిక్సర్‌తో టీ20ల్లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్.. ఆ ఫీట్ చేసిన ఆనందంలో చేసిన సంబరాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అర్థ సెంచరీ పూర్తికాగానే సూర్యకుమార్ బ్యాట్ పైకెత్తి సహచరులకు అభివాదం చేశాక, రెండు చేతులు జోడించి దండం పెట్టాడు. వెరైటీగా ఉన్న ఈ నమస్కారానికి నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే టీమిండియా మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతనిని అభినందిస్తున్నారు.
ఇకపోతే.. భారత్ నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. నికోలస్ పూరన్ (61) (nicols pooran) వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ చేసి పోరాడినప్పటికీ విండీస్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. చివరిలో రొమారియో షెపర్డ్ (29) భారీ సిక్సర్లతో భారత శిబిరంలో అలజడి రేపినప్పటికీ విండీస్‌ను గట్టెక్కించలేకపోయాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.