భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌పై సుప్రీం హైలెవల్ కమిటీ రివ్యూ

By Siva KodatiFirst Published Sep 23, 2022, 6:46 PM IST
Highlights

ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి హైలెవల్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. 

ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి హైలెవల్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. సుప్రీంకోర్ట్ నియమించిన సూపర్‌వైజరీ కమిటీ ఈ మేరకు సమీక్ష జరిపింది. మాజీ చీఫ్ జస్టిస్ కక్రూ, తెలంగాణ ఏసీపీ డీజీ అంజనీ కుమార్, భారత మాజీ క్రికెటర్ వెంకటపతిరాజులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమన్నారు. మ్యాచ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కమిటీ సూచించింది. 26న కమిటీ ఉప్పల్ స్టేడియంను పరిశీలిస్తుందని.. అదే రోజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని కమిటీ పేర్కొంది. 

ఇకపోతే.. ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్లను బ్లాక్ చేయలేదని హెచ్ సీ ఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత హైద్రాబాద్ లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. పేటీఎం ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు విక్రయించినట్టుగా అజహరుద్దీన్ తెలిపారు.   

ALso Read:జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట .. అజారుద్దీన్‌ను తప్పించండి: హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

ఈ మ్యాచ్ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకంపై పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఈ నెల 15న ఆన్ లైన్ లో 11,450 టికెట్లు విక్రయించినట్టుగా ఆయన చెప్పారు.  కార్పోరేట్ బుకింగ్ పేటీఎం ద్వారా 4 వేలు బుక్కయ్యాయని అజహరుద్దీన్ తెలిపారు. నిన్న మూడువేల టికెట్లు విక్రయించామన్నారు. డైరెక్ట్ స్పాన్సర్స్ కు 6 వేల టికెట్లు కేటాయించినట్టుగా తెలిపారు.  

టికెట్ల విక్రయం పేటీఎంకు కాంట్రాక్టు ఇచ్చినందున ఈ విషయమై తమకు సంబంధం లేదని హెచ్ సీ ఏ సెక్రటరీ విజయానంద్ చెప్పారు. పేటీఎం చేస్తున్న దానికి తమకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. హెచ్ సీ ఏలో విబేధాలున్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఒక్క కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కూడా విబేధాలుంటాయన్నారు.అయితే ఈ విషయమై ఏం మాట్లాడినా  ఇబ్బందులు వస్తాయని ఆయన చెప్పారు. 

click me!