IND vs AUS T20I: నాగ్‌పూర్ టీ20కి వర్షం ముప్పు.. టాస్ 8 గంటలకు.. మ్యాచ్ జరిగేనా..?

Published : Sep 23, 2022, 06:45 PM ISTUpdated : Sep 23, 2022, 07:13 PM IST
IND vs AUS T20I: నాగ్‌పూర్ టీ20కి వర్షం ముప్పు.. టాస్ 8 గంటలకు.. మ్యాచ్ జరిగేనా..?

సారాంశం

IND vs AUS T20I Live: మొహాలీలో ముగిసిన  తొలి పోరులో ఓడిన భారత జట్టు నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తున్నది. కానీ వరుణుడు ఈ మ్యాచ్ నిర్వహణకు సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాాయి.

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  నాగ్‌పూర్ లో నేడు జరగాల్సి ఉన్న రెండో టీ20 జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానంగా మారింది. నాగ్‌పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం వర్షం కారణంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ కు కూడా రాలేకపోయారు. వాస్తవానికి సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు ఆ ప్రక్రియను అరగంటపాటు వాయిదా వేశారు. అయితే 7 గంటలకు అంపైర్లు, కెప్టెన్లు వచ్చి గ్రౌండ్ ను పరిశీలించినా ఫలితం మాత్రం మారలేదు. తాజాగా  టాస్ మరో  గంట ఆలస్యంగా వేయనున్నారు. అయితే 8 గంటలకు అంపైర్లు గ్రౌండ్ ను పరిశీలించాకే గ్రౌండ్ మ్యాచ్ జరపడానికి అనువుగా ఉందా.?? లేదా..? అనేది తేలుతుంది.

శుక్రవారం నాగ్‌పూర్ లో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో గ్రౌండ్ లో అవుట్ ఫీల్డ్ తడిగా  మారింది. ప్రస్తుతం గ్రౌండ్ సిబ్బంది గ్రౌండ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మరి మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది కొద్దిసేపటి తర్వాత తేలనుంది. 

మొహాలీలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 208 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైంది. బుమ్రా లేని లోటు ఆ మ్యాచ్ లో స్పష్టంగా తెలిసింది.  మరి నేటి మ్యాచ్ లో బుమ్రా ఆడనున్నాడని తెలుస్తున్నది. బుమ్రా ఆడితే అతడి సారథ్యంలో భారత బౌలర్లు ఏమేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

 


తుది జట్లు అంచనా:  

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా 

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామోరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హెజిల్వుడ్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది