IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... గాయంతో ఆ ఆల్‌రౌండర్ దూరం...

Published : Sep 23, 2020, 06:56 PM ISTUpdated : Sep 23, 2020, 07:05 PM IST
IPL 2020:  సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి షాక్... గాయంతో ఆ ఆల్‌రౌండర్ దూరం...

సారాంశం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన మిచెల్ మార్ష్... కుంటుతూనే బ్యాటింగ్‌కి వచ్చిన మార్ష్... మొదటి బంతికే అవుట్! మార్ష్ స్థానంలో విండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్‌కి జట్టులో స్థానం..

IPL 2020 సీజన్ 13లో మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయంతో  కుదేలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన మిచెల్ మార్ష్, బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కి వచ్చి మొదటి బంతికే అవుట్ అయ్యాడు. చీలిమండకి తగిలిన గాయం ప్రమాదకరంగా ఉండడంతో ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్కమించాడు మిచెల్ మార్ష్.

అతని స్థానంలో విండీస్ పేసర్ జాసన్ హోల్డర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో 21 మ్యాచులు ఆడిన ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 225 పరుగులతో పాటు 20 వికెట్లు కూడా తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున కూడా ఆడిన విండీస్ వన్డే కెప్టెన్ హోల్డర్, చివరగా 2016లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. ఐపీఎల్ కెరీర్‌లో 11 మ్యాచులు ఆడిన హోల్డర్ 5 వికెట్లు మాత్రమే  తీశాడు.

PREV
click me!

Recommended Stories

CSK : సింహం వేట మొదలైంది.. నెట్స్‌లో ధోని ఫైర్ ! పూనకాలు తెప్పించే వీడియో !
T20 World Cup 2026 లో బిగ్ ట్విస్ట్.. పాకిస్థాన్ ప్లేస్‌లో ఆ టీమ్ వస్తే రచ్చ రచ్చే !