IPL 2020: చాహాల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్... టీవీ ముందు ఆమె ఏం చేసిందంటే...

Published : Sep 23, 2020, 05:28 PM IST
IPL 2020: చాహాల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్... టీవీ ముందు ఆమె ఏం చేసిందంటే...

సారాంశం

బెయిర్ స్టో, మనీశ్ పాండేలను అవుట్ చేయడంతో పాటు విజయ్ శంకర్‌ను డకౌట్ చేసిన యజ్వేంద్ర చాహాల్... చాహాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి ఎంపికవ్వడంతో ఆనందంతో డ్యాన్సు చేసిన ధనశ్రీ వర్మ... సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన చాహాల్ ప్రియురాలు, కాబోయే భార్య...

ఐపీఎల్ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజా అందిస్తోంది. ఇప్పటిదాకి జరిగిన అన్ని మ్యాచులు ఆసక్తికరంగా సాగుతూ ఎంతో కొంత ఉత్కంఠ రేపాయి. గత సీజన్‌లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను 10 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో 121/2 స్కోరుతో మంచి పటిష్ట స్థితిలో కనిపించిన సన్‌రైజర్స్... మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా 34 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆకట్టకున్న బెయిర్ స్టో, మనీశ్ పాండేలను అవుట్ చేయడంతో పాటు విజయ్ శంకర్‌ను డకౌట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. ఈ

ముగ్గురూ అవుట్ కావడంతో మ్యాచ్‌పై పట్టు బిగించిన బెంగళూరు, దాన్ని కొనసాగింది విజయం సాధించింది. మూడు కీలక వికెట్లు తీసిన చాహాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తన కాబోయే భర్తకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రావడంతో సంతోషం పట్టలేకపోయిన చాహాల్ ప్రియురాలు ధనశ్రీ వర్మ, టీవీ ముందుకొచ్చి డ్యాన్స్ చేసేసింది.

‘నా మ్యాన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అంటూ కేరింతలు కొడుతూ చిందులు వేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది చాహాల్ ప్రియురాలు.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !