గబ్బాకు అలా ఇండోర్‌కు ఇలా..? ఎందుకీ వివక్ష..? ఐసీసీపై గవాస్కర్ ఆగ్రహం

Published : Mar 04, 2023, 02:06 PM IST
గబ్బాకు అలా ఇండోర్‌కు ఇలా..? ఎందుకీ వివక్ష..? ఐసీసీపై  గవాస్కర్ ఆగ్రహం

సారాంశం

INDvsAUS: ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టు అనంతరం ఐసీసీ ఈ పిచ్ కు ‘పూర్’ రేటింగ్ ఇవ్వడంపై  భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఇండియా-ఆస్ట్రేలియా  మధ్య శుక్రవారం ఇండోర్ లో ముగిసిన  టెస్టుపై ఐసీసీ  వెల్లడించిన నిర్ణయంపై భారత మాజీ సారథి   సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇండోర్ పిచ్  టెస్టు మ్యాచ్ నిర్వహణకు ఆమోదయోగ్యంగా లేదని ఐసీసీ వెల్లడించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. గబ్బా కంటే ఇండోర్ ఎందులో బాగోలేదో చెప్పాలని ఆయన  ఐసీసీకి చురకలంటించాడు. 

ఇండోర్ పిచ్ స్పిన్నర్లకు అతిగా సహకరించిందని.. ఇక్కడ బ్యాట్ - బాల్  మధ్య సమతూకంగా  పోరు జరిగేలా పిచ్ లేదని ఐసీసీ  ఈ పిచ్ కు ‘పూర్’ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.   ఏడు సెషన్లలోనే ముగిసిన ఆటలో ఆస్ట్రేలియా విజయం సాధించిన అనంతరం ఐసీసీ మ్యాచ్ రిఫరీ  క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందజేశాడు. 

ఇదే విషయమై తాజాగా గవాస్కర్ ఇండియా టుడేలో  జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇండోర్ కు పూర్ రేటింగ్ ఇచ్చారు సరే.  గతేడాది డిసెంబర్ లో  బ్రిస్బేన్ (గబ్బా) వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్  జరిగింది.  ఆ మ్యాచ్ అయితే రెండు రోజుల్లోనే ముగిసింది. మరి గబ్బాకు ఎన్ని డీ మెరిట్ పాయింట్స్ ఇచ్చారు..? ఆ  టెస్టుకు మ్యాచ్ రిఫరీ ఎవరు..?’అని  ఘాటుగా ప్రశ్నించారు. 

కాగా డిసెంబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దక్షిణాఫ్రికా..  డిసెంబర్ 17న  గబ్బాలో రెండో టెస్టు ఆడింది. ఈ మ్యాచ్  రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.  తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 152 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 99 పరుగులకే ఆలౌట్ అయింది.  ఆస్ట్రేలియా కూడా తొలి ఇన్నింగ్స్ లో  218 పరుగులకే ఆలౌట్ అయింది.  రెండో ఇన్నింగ్స్ లో 35 పరుగులను ఛేదించడానికి 4 కీలక వికెట్లు కోల్పోయింది.   రెండు రోజులు పూర్తి కాకుండానే ఈ మ్యాచ్ ముగిసింది.  ఈ మ్యాచ్ లో  సీమర్లకు అనుకూలించే పిచ్ ను తయారుచేసిన ఆస్ట్రేలియాపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న  ఆస్ట్రేలియా జట్టులో  కీలక ఆటగాళ్లైన మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ లు ఈ టెస్టులోనే గాయపడ్డారు. భారత్ తో తొలి రెండు టెస్టులు ఆడలేదు. 

 

స్వదేశంలో ఎవరికీ నచ్చిన విధంగా వారు పిచ్ లు తయారుచేసుకుని ప్రత్యర్థి టీమ్ ను  బోల్తా కొట్టిస్తే తప్పులేదు గానీ భారత్ లో  ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా స్పిన్ పిచ్ లు ఉంటే మాత్రం అందరూ  భారత్ ను వేలెత్తి చూపడం సబబు కాదని  గవాస్కర్ గతంలో కూడా  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండోర్ పిచ్ మీద రాద్దాంతం చేస్తున్న వారికి కూడా సన్నీ  ధీటుగా సమాధానమిచ్చాడు. 
 

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర