రూ.42 లక్షల విరాళం ప్రకటించిన బ్రెట్‌లీ... ఇండియా నాకు సెకండ్ హోమ్ అంటూ...

By Chinthakindhi RamuFirst Published Apr 27, 2021, 6:41 PM IST
Highlights

క్రిప్టో రిలీఫ్ ఫండ్‌కి బిట్ కాయిన్ విరాళంగా ప్రకటించిన బ్రెట్ లీ... ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సప్లై కోసం వినియోగించాలంటూ వినతి...

నిన్న 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు సాయం చేసిన ప్యాట్ కమ్మిన్స్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్...

దేశంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ 50 వేల అమెరికన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అతని నుంచి స్ఫూర్తిపొందిన ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ... తనవంతు సాయం ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

ఇండియాలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సప్లై కోసం 1 బిట్ కాయిన్ (దాదాపు 42 లక్షల రూపాయలు) విరాళంగా ప్రకటించాడు. ‘ఇండియా ఎప్పుడూ నాకు రెండో ఇళ్లు లాంటిది. క్రికెటర్‌గా కొనసాగినన్న రోజులు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇక్కడి ప్రజలతో నాకు ఎంతో చక్కని అనుబంధం ఉంది.

Well done 🙏🏻 pic.twitter.com/iCeU6933Kp

— Brett Lee (@BrettLee_58)

భారతదేశానికి ఎప్పుడూ నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. కరోనా విపత్తుతో భారతదేశ ప్రజలు ఇబ్బంది పడడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో ఉండండి. చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి’ అంటూ ట్వీట్ చేశాడు బ్రెట్‌లీ. 

click me!