australia vs south africa: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

Published : Jun 11, 2025, 11:06 PM IST
steve smith test

సారాంశం

australia vs south africa: స్టీవ్ స్మిత్ లార్డ్స్‌లో 99 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియాకు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు.

Steve Smith breaks 99 year Lords Test record: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. మ్యాచ్ తొలి రోజే ఉత్కంఠభరితంగా మారింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరుకుంది. వ‌రుస వికెట్లు ప‌డుతున్న స‌మ‌యంలో స్టీవ్ స్మిత్ కీల‌క‌మైన ఇన్నింగ్స్ ను ఆడాడు.

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైన‌ల్ లో హాఫ్ సెంచ‌రీ కొట్టిన స్టీవ్ స్మిత్

వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ లో ఆసీస్ 100 పరుగులలోపే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. జట్టుకు కీలకైన ఇన్నింగ్స్ ను ఆడాడు. 112 బంతుల్లో 66 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. ఇది కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే కాదు.. స్టీవ్ స్మిత్ కెరీర్ లో చరిత్ర సృష్టించిన ఓ క్షణం.

ఎందుకంటే ఈ హాఫ్ సెంచరీతో స్మిత్ లార్డ్స్ మైదానంలో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకూ ఈ ఘనత 99 సంవత్సరాలుగా వారెన్ బార్డ్స్‌లే పేరిట ఉంది. ఆయన 1909 నుంచి 1926 మధ్య 5 టెస్టుల్లో 575 పరుగులు చేశారు. అయితే, ఇప్పుడు స్టీవ్ స్మిత్ ఆ పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ 591 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

డాన్ బ్రాడ్‌మాన్ ను దాటేసిన స్టీవ్ స్మిత్

క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ లార్డ్స్‌ రికార్డును స్మిత్ అధిగమించాడు. ఆయన 8 ఇన్నింగ్స్‌లలో 551 పరుగులు మాత్రమే చేశారు. వెస్ట్ ఇండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ కూడా 571 పరుగులే చేశాడు. కానీ, ఆ లెజెండరీల రికార్డును ఇప్పుడు స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు.

600 పరుగుల మైలురాయికి మరో హాఫ్ సెంచరీ దూరంలో స్టీవ్ స్మిత్

ఇంకా ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ లో 600 పరుగులు పూర్తి చేసే ఛాన్స్ వుంది. స్మిత్ మరొక హాఫ్ సెంచరీ సాధిస్తే లార్డ్స్‌లో 600 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధిస్తాడు. ఈ ఘనత వచ్చే 100 సంవత్సరాల పాటు నిలవొచ్చని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

కాగా, డబ్ల్యూస్‌టీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) ఫైనల్‌ తొలి రోజు లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా తన అదిరిపోయే బౌలింగ్‌తో దుమ్మరేపాడు. రబాడా 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 212 పరుగులకే ఆలౌట్ అయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rohit Sharma : సిక్సర్ల మోత.. రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలే !
IPL : ఆర్సీబీ బిగ్ సీక్రెట్.. అభిమానులకు మళ్లీ పండగే !