ICC ODI World Cup 2023 : ఇంగ్లాండ్‌కు మరో షాక్ .. చిత్తుగా ఓడించిన శ్రీలంక , సెమీస్ అవకాశాలు సంక్లిష్లం

By Siva Kodati  |  First Published Oct 26, 2023, 9:10 PM IST

వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌  శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది . ఇంగ్లీష్ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న రోహిత్ శర్మన్ ఓడించడం అంత సులభం కాదు.  


వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దిగిన ఈ జట్టు తాజాగా శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లంకేయుల ధాటికి ఇంగ్లాండ్ 156 పరుగులకే కుప్పకూలగా.. స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 25.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక బౌలర్లు వణికించారు. వీరి దెబ్బకు ఇంగ్లీష్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

బెన్ స్టోక్స్ (43), జానీ బెయిర్‌స్టో (30), డేవిడ్ మలన్ (28)లు ధాటిగా ఆడినా ఆ జోరు కొనసాగించలేకపోయారు. కీలక ఆటగాళ్లైన జోరూట్ (3), జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్ స్టోన్ (1), మొయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (0), ఆదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14)లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2, మహీశ్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు. 

Latest Videos

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కులాశ్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (11) వెంట వెంటనే ఔట్ అయ్యారు. ఈ దశలో పాథుమ్ నిశాంక (77), సదీర విక్రమార్క (65)లు చివరి వరకు క్రీజులో వుండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లో డేవిడ్ విల్లీకి రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లీష్ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న రోహిత్ శర్మన్ ఓడించడం అంత సులభం కాదు. ఆ వెంటనే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది. 

click me!