అక్కడ ఇరుక్కుపోయిన బంతి... కివీస్ ఆటగాడికి తప్పిన ప్రమాదం

By Arun Kumar PFirst Published Aug 16, 2019, 3:17 PM IST
Highlights

శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో న్యూజిలాండ్ క్రికెటర్ కి పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన బంతి కివీస్ ఆటగాడి హెల్మెట్ లోంచి దూసుకెళ్లింది.  

క్రికెట్ అనేది పైకి సరదా ఆటగానే  కనిపిస్తున్నా నిజానికి చాలా డేంజరస్ గేమ్... ఈ మాటలన్నది విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియార్ లారా. అతడు అన్నట్లుగానే అదెంత ప్రమాదకర ఆటో ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది. అతడు బ్యాటింగ్ చేస్తూ బౌలర్ విసిరిన బంతి ప్రమాదకర రీతిలో తాకడంతో మృతిచెందాడు. ఈ సంఘటన క్రికెట్ ప్రియులనే కాదు ప్రపంచం మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తాజాగా అలాంటి ప్రమాదకర సంఘటన శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్ లో చోటుచేసుకుంది. కానీ ఈ ప్రమాదం నుండి కివీస్ క్రికెటర్ సురక్షితంగా బయటపడ్డాడు. 

న్యూజిలాండ్ జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా టెస్ట్ సీరిస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇలా బుధవారం ఇరుజట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన పర్యాటక జట్టు రెండోరోజైన గురువారం కూడా బ్యాటింగ్ కొనసాగించింది. ఈ  క్రమంలో టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్ బ్యాటింగ్ చేస్తుండగా ప్రమాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

శ్రీలంక స్పిన్నర్ లసిత్ ఎమ్బుదినియా బౌలింగ్ బౌల్ట్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్సై నేరుగా బౌల్ట్ పైకి  దూసుకెళ్లింది. అతడు తలకు రక్షణగా వున్న హెల్మెట్ లోంచి దూసుకెళ్లి గ్రీల్స్ ఇరుక్కుంది. అయితే ఈ  ఘటనలో బౌల్ట్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఈ ప్రమాదకర  ఘటన సరదా సంఘటనగా  మారిపోయింది. 

అయితే బౌల్ట్ ఎదుర్కొన్న బంతి స్పిన్ బౌలర్ కావడంతో ప్రమాదం తప్పింది. అదే ఫాస్ట్ బౌలర్ వేసి వుంటే ఈ వేగానికి బంతి హెల్మెట్ లో నుండి దూసుకెళ్లిందే. దీనివల్ల ప్రమాదం  జరిగే అవకాశాలుండేవని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాబట్టి ఆటగాళ్ల విషయంలో ముఖ్యంగా  బ్యాట్స్ మెన్స్ రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసిందని వారు  అభిప్రాయపడుతున్నారు.   
 

pic.twitter.com/i8oQaugKhp

— Out of Context Cricket (@ooccricket)
click me!