ఆసియాకప్ 2022: బంగ్లా బ్యాడ్ లక్... శ్రీలంక విజయం...!

By telugu news teamFirst Published Sep 2, 2022, 9:33 AM IST
Highlights

ఈ పోరులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టు విజయనానికి సహకరించాడు. ఇక్కడ బంగ్లాదేశ్ బౌలింగ్ లో విఫలం కావడం వల్లే శ్రీలంక విజయం సాధించడం గమనార్హం.
 

ఆసియాకప్ 2022లో భాగంగా గురువారం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ని బ్యాడ్ లక్  వెంటాడింది. దీంతో... గెలవాల్సిన మ్యాచ్ కాస్త ప్రత్యర్థి జట్టులోకి వెళ్లిపోయింది. రెండు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో... గ్రూప్ బి నుంచి సూపర్-4 లో అడుగుపెట్టిన రెండో జట్టుగా శ్రీలంక నిలవడం గమనార్హం.

ఈ మ్యాచ్ లో చివరి వరకు చాలా ఉత్కంఠభరితం సాగింది. ఈ పోరులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టు విజయనానికి సహకరించాడు. ఇక్కడ బంగ్లాదేశ్ బౌలింగ్ లో విఫలం కావడం వల్లే శ్రీలంక విజయం సాధించడం గమనార్హం.

తొలుత టాస్ ఓడి బంగ్లాదేశ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ముస్తాఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పతుమ్ నిస్సంక (19 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్)  6, 4  రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్లో కుశాల్ మెండిస్  కూడా 6, 6, 4 తో చెలరేగాడు. అయితే ఎబాదత్ హోసేన్ వేసిన ఆరో ఓవర్లో నిస్సంక  ముస్తాఫిజుర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

అదే ఓవర్లో లంకకు మరో షాక్ తగిలింది. వన్ డౌన్ లో వచ్చిన చరిత్ అసలంక (1) కూడా  మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన గుణతిలక  (11) రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించినా ఎబాదత్.. 8వ ఓవర్లో అతడిని కూడా ఔట్ చేశాడు. లంక భారీ ఆశలు పెట్టుకున్న భానుక రాజపక్స (2) కూడా టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో నయీమ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 9 ఓవర్లకు లంక.. 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి కష్టాల్లో పడింది. 

కానీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దసున్ శనకతో  కలిసి కుశాల్ మెండిస్ చెలరేగాడు. మెహదీ హాసన్ వేసిన ఆరో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం (నోబాల్) తప్పించుకున్న మెండిస్ తనకు దొరికిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నోబాల్ శ్రీలంకకు మంచి హెల్ప్ కాగా... బంగ్లా కొంపముంచింది. ఇలా నోబాల్ వేయడం ఒక్కసారి కాదు.. మ్యాచ్ మొత్తంలో నాలుగుసార్లు నోబాల్ వేయడం గమనార్హం. ఈ నోబాల్సే బంగ్లాని కొంపముంచాయి.. శ్రీలంకకు కలిసొచ్చాయి. 
 

click me!