క్రికెట్ గ్రౌండ్‌లోకి పాము! తృటిలో తప్పించుకున్న ఇసురు ఉదాన... లంక ప్రీమియర్ లీగ్‌లో...

Published : Aug 13, 2023, 06:32 PM IST
క్రికెట్ గ్రౌండ్‌లోకి పాము! తృటిలో తప్పించుకున్న ఇసురు ఉదాన... లంక ప్రీమియర్ లీగ్‌లో...

సారాంశం

పక్కనుంచి వెళ్తున్న పామును చూసి ఉలిక్క పడ్డ లంక ప్లేయర్ ఇసురు ఉదాన.. బీ-లవ్ కెండీ, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సంఘటన

ఇండియాలో గ్రౌండ్‌లోకి పాములు, కుక్కలు రావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది కానీ పొరుగు దేశం లంకలో ఇది చాలా కామన్. లంక ప్రీమియర్ లీగ్‌లో ఇలాగే ఓ పాము, గ్రౌండ్‌లోకి వచ్చి హల్‌చల్ చేసింది. బౌండరీ లైన్‌కి కాస్త ముందు ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ప్లేయర్ ఇసురు ఉదాన, తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు..

ఆగస్టు 12న బీ-లవ్ కెండీ, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన జరిగిన మ్యాచ్‌లో బీ-లవ్ కెండీ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ పాము... గ్రౌండ్‌లో ప్రత్యేక్షమైంది.

పాము వచ్చిన విషయం తెలియని ఇసురు ఉదాన, వెనక్కి జరిగి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. పక్కనుంచి ఒక్కసారిగా పాము వెళ్లడంతో ఉలిక్కి పడి పక్కకు జరిగాడు. ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఫీల్డింగ్‌లో మునిగిపోయాడు..

ఇదే పాము అంతకుముందు ఎల్‌ఈజీ బోర్డుల దగ్గర కనిపించి, కెమెరామెన్‌ని భయపెట్టింది. పాము కనిపించడంతో కెమెరామెన్, తన కెమెరాని వదిలిపెట్టి పక్కకు జరిగిపోయాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బీ-లవ్ కెండీ, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. పాక్ ప్లేయర్ మహ్మద్ హారీస్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేయగా ఫకార్ జమాన్ 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. ఏంజులో మాథ్యూస్ 22, వానిందు హసరంగ 19 పరుగులు చేశారు. 

ఈ లక్ష్యఛేదనలో జఫ్నా కింగ్స్, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేయగలిగింది.  బీ-లవ్ కెండీకి 8 పరుగుల తేడాతో విజయం దక్కింది. షోయబ్ మాలిక్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా జఫ్నా కింగ్స్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 

లంక ప్రీమియర్ లీగ్‌ 2023 సీజన్‌లో ఇలా పాము వల్ల మ్యాచ్‌కి అంతరాయం కలగడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఇదే గ్రౌండ్‌లో జూలై 31న గాలే టైటాన్స్, దంబుల్లా వౌరా మధ్య జరిగిన మ్యాచ్‌ సమయంలోనూ ఓ భారీ సర్పం క్రీజులోకి వచ్చింది. శ్రీలంకలో పాముల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ కొలంబోలో వీటి సంఖ్య భారీగా ఉండడమే ఇలా నాగరాజుల ఎంట్రీకి కారణమంటున్నారు లంక క్రికెట్ ఫ్యాన్స్.. 

PREV
click me!

Recommended Stories

Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?