SRHvsRCB: వార్నర్ వర్సెస్ కోహ్లీ... ఎవరి బలమెంత?

By team teluguFirst Published Sep 21, 2020, 3:28 PM IST
Highlights

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బెయిర్ స్టో, కేన్ విలియంసన్... డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఇప్పటికే ఓసారి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్‌తో పాటు ఆరోన్ ఫించ్ మెరుపులనే నమ్ముకున్న ఆర్‌సీబీ...
గత సీజన్‌లో వరుసగా 6 ఓటములు చవిచూసిన బెంగళూరు... కోహ్లీ కెప్టెన్సీకి కీలకంగా మారిన ఐపీఎల్ టైటిల్...

IPL 2020లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతోంది. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టోర్నీలో మంచి పర్ఫెమెన్స్ ఇస్తున్న సన్‌రైజర్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో, వరుస ఓటములతో గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన కోహ్లీసేనను ఎదుర్కోబోతంది. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా 15 సార్లు తలబడగా బెంగళూరు 6 సార్లు, సన్‌రైజర్స్ 8 సార్లు విజయం సాధించాయి. వర్షం కారణంగా ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.

భారీ హిట్టర్లు ఉన్న ఇరు జట్లు టోర్నీలో భారీ స్కోర్లు నమోదుచేశాయి. ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ అత్యధికంగా 231 పరుగుల స్కోరు చేయగా, హైదరాబాద్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 227 పరుగులు. ఎస్ఆర్‌హెచ్‌, కోహ్లీ సేనపై చేసిన అతి తక్కువ స్కోరు 135 పరుగులు. బెంగళూరు, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యల్పంగా 113 పరుగులు చేసింది.

గత రెండు సీజన్లలో ఇరు జట్లు రెండేసి విజయాలను నమోదుచేశాయి. రెండు సీజన్లలోనూ మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవగా, రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌కి విజయం దక్కింది. 

click me!