కోహ్లీ బలహీనతను స్పిన్నర్లు కనిపెట్టేశారు : వివిఎస్ లక్ష్మణ్ విశ్లేషణ

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 5:58 PM IST
Highlights

విరాట్ కోహ్లీ...టీమిండియా ఎన్నో మరుపురాని విజయాలను అందించిన సక్సెస్ ఫుల్ సారథే కాదు బ్యాట్ మెన్ కూడా. అలాంటిది ఐపిఎల్ విషయానికి వస్తే తాను కెప్టెన్ గా వున్న రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలపలేని చెత్త కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఈ ఐపిఎల్ సీజన్ 12 లో అయితే మరింత ఘోరంగా ఆడుతున్న ఆర్సిబి ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. అందరు ప్లేయర్లతో పాటే కోహ్లీ కూడా ఫేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆర్సిబి ఓటమికి కారణమవుతున్నాడు. అయితే ఇలా కోహ్లీ విఫలమవడానికి గల కారణాలను సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటర్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ మీడియాకు వివరించారు. 
 
ఆర్సిబి సారథి విరాట్ కోహ్లీకి ఐపిఎల్ తరపునే కాదు టీమిండియా తరపున బ్యాటింగ్ కు దిగినపుడు ప్రధానంగా స్పిన్ బౌలింగ్ లో తడబడటాన్ని తాను గమనించినట్లు లక్ష్మణ్ పేర్కొన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్లో వున్న కొన్ని లోపాలను గుర్తించిన స్పిన్నర్లు తరచూ అతన్ని ఔట్ చేస్తున్నారని తెలిపాడు. అలా ఈ ఐపిఎల్ సీజన్లో కూడా నాలుగు సార్లు కోహ్లీ బరిలోకి దిగితే రెండు సార్లు స్పిన్ బౌలింగ్ లోనే వికెట్ సమర్పించుకున్నాడని గుర్తుచేశారు. స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమవుతూ వారి చేతికి చిక్కడానికి కారణమిదేనని అన్నారు. 

ప్రధానంగా కోహ్లీ స్పిన్నర్లు విసిరే గూగ్లీలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడన్నారు. గతేడాది ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఆడమ్ జంపా, మయాంక్ మార్కండే వంటి స్పిన్నర్లకు వికెట్ సమర్పించుకున్నాడని గుర్తుచేశారు. అయితే ఈసారి రాజస్థాన్ రాయల్స్ టీం యువ క్రికెటర్ శ్రేయాస్ గోపాల్ వంటి స్పిన్నర్ చేతికి చిక్కాడన్నారు. శ్రేయాస్ చక్కటి బంతిలో కోహ్లీని బోల్తా కొట్టించాడని లక్ష్మణ్ ప్రశంసించారు. 

కాబట్టి స్పిన్నర్లను ఎదుర్కోవడం కోసం కోహ్లీ కూడా తన బ్యాటింగ్ శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే బావుంటుందని సూచించారు. ఇప్పటికే అత్యుత్తమ బ్యాట్ మెన్ గా కొనసాగుతున్న కోహ్లీ ఈ లోపాన్ని సరిచేసుకుంటే  మరింత బాగా రాణించగలడని సూచించారు.  ఈ విషయంపై దృష్టి పెట్టి కోహ్లీ త్వరలోనే ఈ లోపాన్ని అధిగమిస్తాడని భావిస్తున్నట్లు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.    
 
click me!