ఐపిఎల్ సీజన్ 12లో సూపర్ క్యాచ్... పొలార్డ్ మార్క్ ఫీల్డింగ్

By Arun Kumar PFirst Published Apr 4, 2019, 2:59 PM IST
Highlights

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ముంబై జట్టు గెలిచింది అనేబదులు కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు గెలింపించారని అనాలి. పోలార్డ్ అయితే తన అద్భుతమైన పీల్డింగ్ తో బౌండరీలో పట్టిన ఓ క్యాచ్ వీక్షకులను ఆశ్యర్యానికి గురిచేసింది.

ముంబై ఇండియన్స్ జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు పోలార్డ్. అలా అతడు ఇప్పుడే కాదు గత ఐపిఎల్ సీజన్లనో కూడా అద్భుతమైన క్యాచ్ లను అందుకుని సూపర్ క్యాచ్ ల లిస్టులో నిలిచాడు. తాజాగా చెన్నై ఆటగాడు సురేష్ రైనా బౌండరీ వైపు బాదిన బంతిని అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. బౌండరీ లైనుకు కొద్ది దూరంలో అమాంతం ఎగిరి బంతిని అందుకుని శరీరాన్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నాడు. బౌండరీ లైనుకు తగలకుండా పొలార్డ్‌ ఒంటి చేత్తో వెనక్కి డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. 
 
ఇలా లక్ష్యచేధనవైపు సాగుతున్న చెన్నై ఇన్నింగ్స్ కు పొలార్డ్ ఈ అద్భుతమైన క్యాచ్ తో బ్రేక్ వేశాడు. దాదాపు సిక్సర్ గా భావించిన బంతిని అమాంతం పొడగరి పొలార్డ్ అందుకోవడంతో చేసేదేమీ లేక రైనా ఫెవిలియన్ బాట పట్టాడు. 

సొంత మైదానం వాంఖడేలో మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 170 పరుగులు చేసింది.  ఇలా 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని జాదవ్, రైనాలు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అప్పటికే  15 బంతుల్లో 16 (2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు బాది ఊపుమీద కనిపించిన రైనా మరో బౌండరీకి ప్రయత్నించి పొలార్డ్ అద్భుతమైన పీల్డింగ్ కు బలయ్యాడు.   

ఈ అద్భుతమైన క్యాచ్‌ చెన్నై విజయావకాశాలను దెబ్బతీసింది. చివరకు చెన్నై 37 పరుగుల తేడాతో ఈ సీజన్లో మోదటి పరాజయాన్ని చవిచూసింది. ఇలా పొలార్డ్ బౌండరీవద్ద చాకచక్యంగా అందుకున్న ఈ క్యాచ్‌ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకోవడంతో వైరల్ గా మారింది. ముంబై అభిమానులయితే పొలార్డ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
click me!