జాతి వివక్ష... ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివే..

By telugu news teamFirst Published Jul 11, 2020, 2:10 PM IST
Highlights

ఎన్గిడి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్ష పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత మరింత ఎక్కువయ్యాయి. ఒకరి తర్వాత మరోకరు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.

ఇప్పటికే..క్రికెట్‌లోనూ వ‌ర్ణ వివ‌క్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్‌, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆట‌గాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్ర‌వారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.

'బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇత‌ర ఆట‌గాళ్ల  మ‌ద్ద‌తు నాకు ఉంటుంద‌నే ఆశిస్తున్నా. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాల్లో ద‌క్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జ‌ర‌గుతుంది.. క్రికెట్‌లోనూ ఇది కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌కు మా జ‌ట్టులోని ఆటగాళ్లు కూడా క‌లిసి వ‌స్తార‌ని ఆశిస్తున్నా’అని  తెలిపాడు.'  అయితే ఎన్గిడి వ్యాఖ్య‌ల‌పై పలువురు క్రికెటర్లు మండిపడుతున్నారు.

'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలా వ‌ద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకుంటే ఇవ్వు. కానీ మొత్తం ద‌క్షిణాఫ్రికా ప్ర‌జ‌ల‌ను ఇందులోకి లాగొద్దు.' అంటూ ద‌క్షిణాఫ్రికా మాజీ స్పిన్న‌ర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు.

click me!