బంగ్లాదేశ్ చీఫ్ కోచ్ గా రస్సెల్

By Arun Kumar PFirst Published Aug 18, 2019, 9:15 PM IST
Highlights

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దే చర్యలను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రారంభించింది. అందులో భాగంగా నూతన కోచ్ గా రస్సెల్ ని నియమించింది.  

ఇటీవల ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ జట్టు హేమాహేమీలైన జట్లను ఓడించి సత్తా చాటింది. అంతేకాకుండా న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో సెమీస్ కోసం పోటీపడింది. ఈ ప్రదర్శనతో ఆ జట్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే బంగ్లా జట్టు కూడా ఈ అంచనాలను నిలబెట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

తమ జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు(బిసిబి) చర్యలు ప్రారంభించింది. అందుకోసం మొదటి కోచింగ్ సిబ్బందిని మార్చే పని చేపట్టింది.  ఇలా ప్రస్తుత హెడ్ కోచ్ స్టీవ్ రోడ్స్ ని తొలగించి అతడి స్థానంలో రస్సెల్ డోమింగ్ ను నియమించింది.  అతడి పర్యవేక్షణ బంగ్లా జట్టు మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిబి అధికారులు తెలిపారు. 

ప్రపంచ కప్ టోర్నీ తర్వాత ఇంగ్లాండ్ కు చెందిన స్టీవ్ రోడ్స్ ను బిసిబి చీఫ్ కోచ్ పదవి నుండి తొలగించింది. దీంతో ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కోచ్ గా ఆ జట్టు మాజీ కోచ్ ఖాలిద్ మహ్మద్ వ్యవహరించాడు. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన డొమింగోకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ బిసిబి నిర్ణయం తీసుకుంది. అతడి ఈ పదవిలో రెండేళ్ళపాటు కొనసాగనున్నాడు. 

దక్షిణాఫ్రికా వంటి టాప్ జట్టుకు కోచ్ గా పనిచేసిన అనుభవమున్న రస్సెల్ ను బంగ్లా కోచ్ గా నియమించడం మంచి నిర్ణయమేనని నమ్ముతున్నట్లు బిసిబి అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపాడు. అతడి సుధీర్ఘ అనుభవం, అంకితభావంతో పనిచేసే వ్యక్తిత్వం తమ జట్టును మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించాడు. 
  

click me!