సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ...ఈసారి క్రికెట్లో కాదు

Published : Aug 18, 2019, 08:02 PM IST
సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ...ఈసారి క్రికెట్లో కాదు

సారాంశం

టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్రికెట్లోనే కాదు సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాడు. భారత  క్రికెటర్లలో అత్యధికమంది ఫాలోవర్స్ ని  కలిగిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.  

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట వున్న అరుదైన రికార్డులను ఒక్కోటిగా బద్దలుగొడుతూ వస్తున్న కోహ్లీ మరో ఘనత సాధించాడు. అయితే ఈసారి క్రికెట్లో కాకుండా సోషల్ మీడియాలో సచిన్ ను వెనక్కినెట్టిన కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే కోహ్లీని సోషల్ మీడియాలో చాలా మంది అభిమానలు ఫాలో అవుతున్నారు. ఇలా అతడి ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోహ్లీకి  ట్విట్టర్లో 31, ఇన్స్టాగ్రామ్ లో 39.3, ఫేస్ బుక్ 37 మిలియన్ల ఫాలోపర్స్ వున్నారు. ఇలా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ మొదటిస్థానాన్ని ఆక్రమించాడు. 

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట వుండేది. సచిన్ కు ట్విట్టర్లో 30.1, ఫేస్ బుక్ లో 28, ఇన్స్టాగ్రామ్ లో 16.6 మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు. సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా వుండకపోవడం అతడి ఫాలోవర్స్ తగ్గడానికి కారణమయ్యింది. ఇదే సమయంలో  రోజురోజుకు కోహ్లీ క్రేజు మరింత పెరుగుతుండటంతో ఫాలోవర్స్ సంఖ్యలో సచిన్ ను మించిపోయాడు. దీంతో సచిన్ ఈ  విషయంలో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.  

ఇక సోషల్ మీడియాను అసలు ఫాలో కాని  ధోనికి కూడా విపరీతమైన ఫాలోవింగ్ వుంది. అతడికి ట్విట్టర్లో 7.7, ఫేస్ బుక్ లో 20, ఇన్స్టాగ్రామ్ లో 15.5 మిలియన్ల పాలోవర్స్ వున్నారు. భారత ఆటగాళ్లలో కోహ్లీ, సచిన్ తర్వాత అత్యధికంగా అభిమానులు పాలో అవుతోంది ధోనీనే. అయితే ధోని అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకున్నా ఈ స్థాయిలో పాలోవర్స్ వుండటం విశేషం. 
 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?