అది కోహ్లీ సొంత నిర్ణయం.. నేనే షాక్ అయ్యాను.. సౌరవ్ గంగూలీ..!

By telugu news teamFirst Published Oct 23, 2021, 9:52 AM IST
Highlights

 భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం అంత సులభం కాదని.. గతంలో ఉన్న కెప్టెన్లు తనతో సహా అందరూ ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పాడు.
 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీ20 ఫార్మాట్ కి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. బలవంతంగా కోహ్లీని ఆ కెప్టెన్సీ నుంచి తప్పించారనే వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో.. తాజాగా.. ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోహ్లీ నిర్ణయం విని తాను కూడా షాక్ అయ్యానని దాదా చెప్పడం గమనార్హం.

Also Read: T20 worldcup 2021: వెంకటేశ్ అయ్యర్‌తో సహా ఆ నలుగురు స్వదేశానికి... టీమిండియాకి నెట్‌ బౌలర్ల కొరత...

కోహ్లీ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా కెప్టెన్సీ నుంచి తట్టుకోలేదని… అది తన సొంత నిర్ణయం అని స్పష్టం చేశాడు గంగూలీ. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలను తాను అర్ధం చేసుకున్నాను అన్నాడు. భారత జట్టును మూడు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం నడిపించడం అంత సులభం కాదని.. గతంలో ఉన్న కెప్టెన్లు తనతో సహా అందరూ ఒకానొక సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని చెప్పాడు.

Also Read: T20 worldcup 2021: నెదర్లాండ్స్‌పై శ్రీలంక ఘన విజయం... టేబుల్ టాపర్‌గా సూపర్ 12కి ఎంట్రీ...

అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు… ఈ పొట్టి ఫార్మెట్లో ఒక బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని చెప్పాడు. ఇక కెప్టెన్స్ నుండి తప్పుకోవడానికి కారణం ఒత్తిడి అని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుకు మాత్రమే కాదు ఐపీఎల్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు కోహ్లీ.

click me!