కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ట్వంటీ20 మ్యాచ్ ఆడినందుకు బంగ్లాదేశ్, భారత్ జట్లకు బిసిసిఐ చీఫ్ సౌరవ్ గంగూలీ థన్యవాదాలు తెలిపారు. వెల్ డన్ బంగ్లాదేశ్ అంటూ అభినందించారు.
న్యూఢిల్లీ: కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పటికీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ట్వంటీ20 మ్యాచ్ ఆడినందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ బంగ్లాదేశ్, భారత్ జట్లకు ధన్యవాదాలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆదివారం జరిగిన ట్వంటీ20 మ్యాచు వీక్షించడానికి పెద్ద యెత్తున ప్రేక్షకులు వచ్చారు.
టీమిండియాపై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పటికీ రెండు జట్లు క్రికెట్ ఆడినందుకు గంగూలీ థ్యాంక్స్ చెప్పడమే కాకుండా వెల్ డన్ బంగ్లాదేశ్ అంటూ అభినందించారు. ఈ మేరకు ఆయన తన ట్వీటర్ పోస్టు పెట్టారు.
undefined
Thank u to both the teams to play this game under tuff conditions .. well done bangladesh ..
— Sourav Ganguly (@SGanguly99)ముషిఫికుర్ రహీం అజేయంగా 60 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ బారత్ పై సునాయసంగా విజయం సాధించింది. టీ20ల్లో భారత్ పై బంగ్లాదేశ్ కు తొలి విజయం. దీంతో మూడు మ్యాచుల సిరీస్ లో 1-0 స్కోరుతో బంగ్లాదేశ్ ముందంజలో ఉంది. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 7వ తేదీన జరుగుతుంది.
సోమవారం నాడు కూడా ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగానే ఉంది. ఢిల్లీలో, నోయిడాలో కాలుష్యం స్థాయిలు ప్రమాదానికి మించి ఉన్నాయి.