Shubman Gill: సచిన్ , ద్రావిడ్ రికార్డులను బద్దలుకొట్టిన శుభ్‌మన్ గిల్

Published : Jul 03, 2025, 11:49 PM IST
Shubman Gill

సారాంశం

Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు. 269 పరుగులతో లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు.

Shubman Gill:  ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ గా తన తొలి టెస్టు డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్‌లో భారత జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ప్లేయర్ గా శుభ్ మన్ గిల్ రికార్డు సాధించాడు. హెడ్డింగ్లీలో జరిగిన మొదటి టెస్టులో 147 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్.. రెండో టెస్టులో అదిరిపోయే ఇన్నింగ్స్ ను ఆడాడు. మొదటి టెస్టు తర్వాత ఇంకా పెద్ద స్కోరు చేయాల్సి ఉందని కామెంట్స్ చేసిన గిల్.. ఇప్పుడు దానిని నిజం చేసి చూపించాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో తన మాటను నిలబెట్టుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో అవకాశాన్ని ఉపయోగించుకుని గిల్ అద్భుతమైన నాక్ ఆడాడు. రిస్క్‌ లేని, గమ్మత్తైన షాట్లతో బౌండరీలు సాధించాడు. బౌలర్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా తన మొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో రోజు మధ్యాహ్న సెషన్‌లో 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో భారత ఆటగాడిగా అత్యధిక టెస్ట్ స్కోరు నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే, టెస్టు క్రికెట్ లో అత్యధిక స్కోర్ చేసిన కెప్టెన్ గా కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 

 

 

సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన గిల్

1979లో ది ఓవల్ వేదికగా సునీల్ గవాస్కర్ 221 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోర్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో 438 పరుగుల ఛేదనలో గవాస్కర్ 8 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు. కానీ భారత్ కేవలం 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

2002లో ది ఓవల్‌లోనే రాహుల్ ద్రావిడ్ 217 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. ఆ టూర్‌లో ద్రావిడ్ అప్పటికే రెండు సెంచరీలు చేసిన తర్వాత, నాల్గో టెస్టులో దుమ్మురేపాడు. మొత్తంగా 600కి పైగా రన్స్‌తో తన బ్యాటింగ్ అద్భుతాన్ని కొనసాగించాడు. అయితే, ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అలాగే, 2002లో హెడ్డింగ్‌లీలో సచిన్ టెండూల్కర్ 193 పరుగులు చేసి భారత్‌ను ఇన్నింగ్స్ విజయానికి నడిపించాడు. అదే టూర్‌లో రాహుల్ ద్రావిడ్, సంజయ్ బంగర్ అద్భుత ఇన్నింగ్స్ లను ఆడారు.

1990లో ది ఓవల్‌లో రవి శాస్త్రి 187 పరుగులు చేయగా, అప్పట్లో భారత్ 606 పరుగులు చేసిన తొలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ను ఫాలో-ఆన్‌కు దింపింది. కానీ ఆ మ్యాచ్ డ్రా అయ్యింది.

దీంతో గిల్, గవాస్కర్ (221), ద్రావిడ్ (217), టెండూల్కర్ (193), శాస్త్రి (187) రికార్డులను అధిగమించి, ఇంగ్లాండ్‌లో భారత ఆటగాడు చేసిన అత్యధిక టెస్ట్ స్కోరును తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ vs భారత్, రెండో టెస్ట్ – రెండో రోజు ముఖ్యాంశాలు

గిల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 587 పగులు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 269 పరుగులు చేయగా, అతనికి తోడుగా యశస్వి జైస్వాల్ 87 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులతో ఆటను ముగించింది. క్రీజులో జోరూట్ 18 పరుగులు, హ్యారీ బ్రూక్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

 

ఎడ్జ్‌బాస్టన్ లో గిల్ పలు రికార్డులు

1. టెస్ట్‌ల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు

గిల్ 269 పరుగులతో విరాట్ కోహ్లి 2019లో దక్షిణాఫ్రికాపై పుణేలో చేసిన 254* పరుగుల రికార్డును అధిగమించాడు.

2. ఇంగ్లాండ్‌లో భారత బ్యాటర్‌గా అత్యధిక టెస్ట్ స్కోరు

1979లో ది ఓవల్ వేదికగా సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగుల రికార్డును అధిగమించి, గిల్ టాప్‌ స్థానంలో నిలిచాడు.

3. విదేశాల్లో టెస్ట్‌ల్లో భారత ఆటగాడి మూడో అత్యధిక స్కోరు

వీరేంద్ర సెహ్వాగ్ (309 పరుగులు), రాహుల్ ద్రావిడ్ (270 పరుగులు) తర్వాత, గిల్ 269 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

4. SENA దేశాల్లో ఆసియా కెప్టెన్‌గా అత్యధిక స్కోరు

గిల్ 269తో తిలకరత్నే దిల్షాన్ (193 పరుగుల vs ఇంగ్లాండ్, 2011) రికార్డును బ్రేక్ చేశాడు.

5. SENA దేశాల్లో ఆసియా ఆటగాడిగా మూడవ అత్యధిక స్కోరు

జహీర్ అబ్బాస్ (274 పరుగులు), జావేద్ మియాందాద్ (271 పరుగులు) తర్వాత గిల్ నిలిచాడు.

 

 

6. ఎడ్జ్‌బాస్టన్ లో ఐదవ అత్యధిక టెస్ట్ స్కోరు

గిల్ 269 పరుగులు ఎడ్జ్‌బాస్టన్ లో 5వ టాప్ స్కోర్ గా నిలిచింది. ఈ లిస్టులో కుక్ (294), పీటర్ మే (285*), గ్రేమ్ స్మిత్ (277), జహీర్ అబ్బాస్ (274) గిల్ కంటే ముందున్నారు.

7. ఇంగ్లాండ్‌లో భారత్ నాల్గవ అత్యధిక టెస్ట్ స్కోరు

భారత జట్టు 587 పరుగులతో ఇంగ్లాండ్‌లో తమ నాల్గవ అత్యధిక టెస్ట్ స్కోరు నమోదు చేసింది. టాప్-3 స్కోర్లు:

• 664 (2007, ది ఓవల్)

• 628/8 డిక్లేర్డ్ (2002, లీడ్స్)

• 606/9 (1990, ది ఓవల్)

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!