శుభ్‌మన్ గిల్‌కి టెస్ట్ జట్టు పగ్గాలు? రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో BCCIలో కీలక మార్పులు

Published : May 08, 2025, 11:58 AM ISTUpdated : May 08, 2025, 12:22 PM IST
శుభ్‌మన్ గిల్‌కి టెస్ట్ జట్టు పగ్గాలు? రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో BCCIలో కీలక మార్పులు

సారాంశం

రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పిన తర్వాత శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.

టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీలో కీలక మలుపు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం తన టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘‘హలో అందరికీ, నేను టెస్ట్ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నాను. దేశానికి వైట్ జెర్సీలో ప్రాతినిధ్యం వహించటం గర్వంగా అనిపించింది. మీరు అందరూ ఇచ్చిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు’’ అంటూ రోహిత్ భావోద్వేగ పోస్ట్ చేశాడు.ఈ నేపథ్యంలో, 25 ఏళ్ల ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, గిల్‌ను లాంగ్ టర్మ్ కెప్టెన్‌గా తయారుచేయాలన్న ఆలోచనలో ఉంది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం బీసీసీఐతో చర్చల అనంతరం వెలువడనుంది.

ఇదిలా ఉండగా, టీమ్‌ ఇండియా వైస్ కెప్టెన్ అయిన బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను తాత్కాలికంగా తీసుకుంటాడు. అయితే వర్క్ లోడ్ మేనేజ్ మెంట్  దృష్ట్యా బుమ్రా ఇంగ్లండ తో జరిగే  ఐదు టెస్టుల్లో అన్నీ ఆడే అవకాశం లేదని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందుకే కొత్త కెప్టెన్ ఎంపిక అవసరమైంది.ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20న ప్రారంభమై జూలై 31న ముగుస్తుంది. ఈ సిరీస్‌ కే  శుభ్‌మన్ గిల్  ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది. 

ఈ పరిణామాలతో భారత టెస్ట్ జట్టు దిశ మారనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీకి ముగింపు పలకగా, గిల్ చేతుల్లోకి జట్టు బాధ్యతలు వెళ్లే అవకాశం అధికంగా కనిపిస్తోంది. మొత్తానికి దీర్ఘకాలిక వ్యూహంతో టెస్టులకు  యువ క్రీడాకారుడిని కెప్టెన్ గా ఎంపిక చేయాలన్నది సెలెక్టర్ల ఆలోచన.ఇదే జరిగితే, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీతో భారత టెస్ట్ జట్టు కొత్త దశను ప్రారంభించనుంది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !