Shubman Gill: హార్దిక్ పాండ్యాతో గొడవ? శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే?

Published : May 31, 2025, 11:57 PM IST
Shubman Gill Clarifies Rift Rumors with Hardik Pandya

సారాంశం

Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్  జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.  ఆ తర్వాత, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై గిల్ స్పందించాడు. 

Shubman Gill: హార్దిక్ పాండ్యా-శుభ్‌మన్ గిల్ లు గొడవపడ్డారనే వార్తలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. అయితే, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు వార్తులు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా గిల్ స్పందించాడు. మే 31న ముల్లన్‌పూర్‌లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ఈ విషయంపై మాట్లాడాడు.

229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ 208/6 స్కోరుకే పరిమితమై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు.

గిల్, హార్దిక్ మధ్య 'ఇగో' గొడవ

మ్యాచ్ మొదలు కాకముందే, స్టేడియంలో, సోషల్ మీడియాలో గిల్, హార్దిక్ మధ్య 'ఈగో' గొడవ జరుగుతుందనే ప్రచారం మొదలైంది. టాస్ సమయంలో హార్దిక్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోగా గిల్ నిరాకరించడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. అయితే, గిల్ ముందుగానే చేయి చాచడంతో హార్దిక్ చివరికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.

ఇంతటితో ఆగలేదు. గిల్ ఔటైన తర్వాత డీఆర్ఎస్ కోసం వెళ్లగా, ముంబై ఆటగాళ్ళు సంబరాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో హార్దిక్ గిల్ దగ్గర నుంచి 'కమ్ ఆన్' అంటూ పరుగెత్తాడు.

 

ఈ సంఘటనలతో ఇద్దరి మధ్య గొడవ ఉందనే వార్తలు వ్యాపించాయి. మ్యాచ్ తర్వాత ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నప్పటికీ, మాటలు మాట్లాడుకోకపోవడంతో గొడవ ఉందనే అనుమానాలు మరింత బలపడ్డాయి.

గొడవ వార్తలను ఖండించిన గిల్

ఈ వార్తల నేపథ్యంలో గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నమ్మవద్దని అభిమానులకు సూచించాడు. “ప్రేమ తప్ప మరేమీ లేదు (ఇంటర్నెట్‌లో కనిపించేవన్నీ నమ్మకండి)” అని గిల్ రాసుకొచ్చాడు.

గిల్, హార్దిక్ ఇద్దరూ ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యులు.

ఇక, ముంబై ఇండియన్స్ జూన్ 1న పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫైయర్ 2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !