ధావన్ ఫోన్ కొట్టేసిన శ్రేయాస్.. ‘కామ్ డౌన్’ అంటూ ఎలా తప్పించుకున్నాడో చూడండి..

By Srinivas MFirst Published Feb 5, 2023, 4:02 PM IST
Highlights

భారత జట్టులో చోటు కోల్పోయి  టీమ్ కు దూరంగా ఉంటున్నా  ధావన్ అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లోనే ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా   ఫ్యాన్స్  కు ఫన్ పంచడంలో  ధావన్ ది ప్రత్యేక శైలి.  

టీమిండియా  మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్..  వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఫోన్ కొట్టేశాడు.  తన ఫోన్ తనకు ఇవ్వమని గబ్బర్  గద్దరించినా  ‘కామ్ డౌన్’అంటూ  అతడిని కూల్ చేసి అక్కడ్నుంచి ఉడాయించాడు.  శ్రేయాస్ మాయలో  పడ్డ ధావన్..  తన ఫోన్ కొట్టేశాడనే విషయాన్ని మరిచిపోయి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అయ్యర్ ఏంటి,  ధావన్ ఫోన్ కొట్టేయడమేంటని అనుకుంటున్నారా..?  ఇదంతా  గబ్బర్ గారి  రీల్స్ మాయ.  

భారత జట్టులో చోటు కోల్పోయి  టీమ్ కు దూరంగా ఉంటున్నా  ధావన్ అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లోనే ఉంటాడు. సోషల్ మీడియా ద్వారా   ఫ్యాన్స్  కు ఫన్ పంచడంలో  ధావన్ ది ప్రత్యేక శైలి.  తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న   ‘కామ్ డౌన్’ ట్రెండ్ కు కాలు కదిపారు. వీళ్ల స్టైల్ లో  కాన్సెప్ట్ క్రియేట్ చేసి  అభిమానులను అలరించారు.  

ఈ వీడియోలో ధావన్ తన ఫోన్  ఓ చేతిలో పట్టుకుని చూసుకుంటూ నడుచుకుంటూ రాగా అక్కడికి వచ్చిన శ్రేయాస్.. గబ్బర్ ఫోన్ ను లాగేసుకుంటాడు. దానికి ధావన్ కోప్పడి   అయ్యర్  తల మీద ఉన్న ముసుగును తొలగించడానికి యత్నిస్తాడు.  అయితే అయ్యర్ మాత్రం  కామ్ డౌన్  పాటకు డాన్స్ చేస్తూ  ధావన్ ను కూల్ చేయడానికి ట్రై చేస్తాడు.  ధావన్ కూడా  అయ్యర్ తో కలిసి  కాలు కదుపుతాడు. ఇద్దరూ కలిసి  డాన్స్ చేస్తుండగా.. అయ్యర్ అక్కడ్నుంచి జారుకుంటాడు.  కానీ ధావన్ మాత్రం  ‘కామ్ డౌన్.. కామ్ డౌన్’అనుకుంటూ తన ఫోన్  పోయిన విషయాన్ని మరిచిపోయి  డాన్స్ వేస్తుంటాడు.  ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  

 

ఈ వీడియోకు టీమిండియా ఫ్యాన్స్ తో పాటు  భారత క్రికెట్ జట్టు సభ్యులు కూడా   ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, హర్భజన్ సింగ్ లు  ఈ వీడియోకు కామెంట్స్  పెట్టారు.   ఏదేమైనా వీడియోలో అయ్యర్ మాత్రం తన స్టెప్పులతో ఇరగదీశాడు. 

కాగా  ధావన్  జాతీయ జట్టు నుంచి అనధికారికంగా తప్పుకోగా అయ్యర్  శ్రీలంకతో మూడో వన్డేలో గాయమై  ప్రస్తుతం   నేషనల్ క్రికెట్ అకాడమీలో  రీహాబిలిటేషన్ లో ఉన్నాడు.  ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ఎంపికైనా  ఫిబ్రవరి 9న జరిగే  తొలి మ్యాచ్ కు అతడు ఆడతాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది. మ్యాచ్ ఆడకున్నా అయ్యర్ రీల్స్ తో బిజీగా గడుపుతుండటం గమనార్హం. ఇక ధావన్ విషయానికొస్తే  జాతీయ జట్టులో మళ్లీ అతడికి చోటు దక్కడం కష్టమే  కానీ 2023 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున దుమ్ము రేపటానికి రెడీ అవుతున్నాడు. 

click me!