వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్!... మూడో రోజు ఆటలో బ్యాటింగ్‌కి రావడం అనుమానమే?...

Published : Mar 12, 2023, 10:14 AM ISTUpdated : Mar 12, 2023, 10:23 AM IST
వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్!... మూడో రోజు ఆటలో బ్యాటింగ్‌కి రావడం అనుమానమే?...

సారాంశం

మూడో రోజు ఆటలో వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు తెలిపిన శ్రేయాస్ అయ్యర్... స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి! తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రావడం అనుమానమే.. 

అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. మూడో రోజు ఆట ఆరంభానికి ముందు శ్రేయాస్ అయ్యర్ లోయర్ బ్యాక్‌లో నొప్పి రావడంతో అతన్ని స్కానింగ్‌కి పంపించింది బీసీసీఐ మెడికల్ టీమ్...

సాధారణంగా శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. రవీంద్ర జడేజా అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వస్తాడనుకుంటే వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు...

శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోతే అతని ప్లేస్‌లో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా సూర్యకుమార్ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్ గాయపడితే ఆ విషయాన్ని రిఫరీకి తెలియచేసి, కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌ని ఆడేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కి వచ్చేందుకు అవకాశం ఉండదు... 

గాయంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, నాగ్‌పూర్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టులో కూడా ఆడలేదు. శ్రేయాస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించింది టీమిండియా. సూర్యకుమార్ యాదవ్ తన మొట్టమొదటి టెస్టులో 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఓడడంతో సూర్యకుమార్ యాదవ్‌కి రెండో ఇన్నింగ్స్‌లో ఆడే అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 బంతులాడి 4 పరుగులు చేసి అవుటైన శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు శ్రేయాస్ అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమైనది అయితే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కి కూడా అతను దూరం అయ్యే అవకాశం ఉంది..

శ్రేయాస్ అయ్యర్ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటే 50 ఓవర్ల ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కి మరో సిరీస్ దొరికినట్టు అవుతుంది. అయ్యర్ గాయం కోలుకోవడానికి మరింత సమయం కావాలిన వైద్యులు సూచిస్తే, ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా అతను దూరం కావచ్చు. ఇది కేకేఆర్‌ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని కొనుగోలు చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, అతన్ని కెప్టెన్‌గా నియమించింది. అయ్యర్ దూరమైతే, కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది కేకేఆర్.. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?