నా నిర్ణయం సరైందే.. ఎవరితోనైనా చర్చకు సిద్ధం... రవిశాస్త్రి

By telugu teamFirst Published Dec 14, 2019, 1:33 PM IST
Highlights

ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంతో మనం ప్రత్యర్థికి సవాల్‌ విసిరామన్నారు. దీనిపై ఎవరు వాదనకు దిగినా అందుకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ధోని బలం ఏమిటో మనకు తెలుసని... ధోని ఒక మ్యాచ్‌ ఫినిషర్ అని అన్నారు.


 వన్డే ప్రపంచకప్ లో... టీమిండియా సెమిస్ లోనే  నిష్క్రమించింది. న్యూజిలాండ్ తో జరిగిన నాకౌట్ పోరులో టీమిండియా ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 240 పరుగుల టార్గెట్ ను నిర్దేశించగా... టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. పిచ్ కారణంగా... క్రికెటర్లు.. వెంట వెంటనే ఔట్ అయ్యారు.

 కాగా, ఎంఎస్‌ ధోని(50), రవీంద్ర జడేజా(77)లు పోరాట పటిమతో ఓ దశలో మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తింది. జడేజా, ధోని స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ కివీస్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే ఆనాటి మ్యాచ్‌లో ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వచ్చాయి. ధోనిని ఇంకాస్త ముందు పంపితే ఫలితం వేరేగా ఉండేదనే వాదన వచ్చింది.

కాగా... ఈ వాదనలపై తాజాగా రవిశాస్త్రి స్పందించారు.  ధోనీని ఏడో స్థానంలో పంపడం సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీని నాలుగో క్రికెటర్ గా పంపడం సరైన నిర్ణయం కాదని... అలా చేసి ఉంటే మ్యాచ్ చివరి దాకా కూడా వచ్చేది కాదని అన్నారు.

 ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంతో మనం ప్రత్యర్థికి సవాల్‌ విసిరామన్నారు. దీనిపై ఎవరు వాదనకు దిగినా అందుకు సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ధోని బలం ఏమిటో మనకు తెలుసని... ధోని ఒక మ్యాచ్‌ ఫినిషర్ అని అన్నారు.

అలాంటప్పుడు టాపార్డర్‌లో పంపలేమని అందుకే పంపించలేదని వివరణ ఇచ్చారు.  ఇంకా సుమారు 10 బంతులు ఉండగా ధోని రనౌట్‌ అయ్యాడని...విజయానికి 20 పరుగులు అవసరమైన  సమయంలో 10 బంతులు ఉండి ధోని క్రీజ్‌లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు, రెండు బంతుల్ని సిక్స్‌లుగా కొట్టాడంటే ఇంకా ఎనిమిది బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండేది. కానీ ధోని ఔట్‌ కావడంతో విజయం చేజారిందని  రవిశాస్త్రి పేర్కొన్నాడు.
 

click me!