రితికకు రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన సందేశం

Published : Dec 13, 2019, 05:11 PM IST
రితికకు రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన సందేశం

సారాంశం

తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య రితికను ఉద్దేశించి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు.నువ్వు లేకుండా నా జీవయయానాన్ని ఊహించుకోలేనని అన్నాడు.

ముంబై: భార్య రితిక కోసం టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అత్యంత ప్రేమాదస్పదమైన సందేశాన్ని పోస్టు చేశాడు. తమ ఇద్దరి ఫొటోలను జత చేస్తూ రోహిత్ శర్మ జీవితంలో మరిచిపోలేని వ్యాఖ్యను రితిక కోసం ట్వీట్ చేశాడు. 

"నువ్వు లేని నా జీవనయానాన్ని ఊహించలేను" అని అన్నాడు. ఇంతకన్నా ఉత్తమమైందేదీ ఉండదు. ఐ లవ్ యూ అని ట్వీట్ చేశాడు. వాటితో పాటు కొన్ని ఎమోజీలు కూడా జత చేశాడు. రోహిత్ శర్మ 2015లో రితికను వివాహం చేసుకున్నాడు. 

దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరి పెళ్లి  జరిగింది. వారికి ఓ కూతురు కూడా ఉంది. త్వరలో ఏడాది పాప అవుతుంది. రోహిత్ శర్మ ట్వీట్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. అభినందనలు కూడా చెప్పారు. 

మీ ఇద్దరి ఆనందదాయకమైన వివాహ మహోత్సవం అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. ఆత్మల ఐక్యతకు వాస్తవ జీవితానికి అత్యంత ఉత్తమమైన నిర్వచనం అని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా ప్రతిస్పందనల వర్షం కురుస్తూనే ఉంది.  

 

PREV
click me!

Recommended Stories

Siraj: ఓవల్ హీరో నుంచి రిజర్వ్ బెంచ్ వరకు.. మహమ్మద్ సిరాజ్‌కు ఏమైంది?
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే