కూతురితో విరాట్ కోహ్లీ.. ఫోటోలు వైరల్

Published : Jul 12, 2021, 11:15 AM IST
కూతురితో విరాట్ కోహ్లీ.. ఫోటోలు వైరల్

సారాంశం

కోహ్లీ తన కుమార్తెతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా అనుష్క శర్మ షేర్ చేయగా.. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దంపతులకు ఈ ఏడాది మొదట్లో పాప పుట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పాప ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. కోహ్లీ తన కుమార్తెతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా అనుష్క శర్మ షేర్ చేయగా.. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

వామికతో విరాట్ ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న దృశ్యం ఆ ఫొటోలలో కనిపిస్తుంది. ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వామికకు ఆరు నెలలు నిండిన సందర్భంగా కోహ్లీ దంపతులు కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను షేర్ చేసిన అనుష్క... మా పాప చిరునవ్వు మా ప్రపంచాన్నే మార్చివేసింది... అని రాశారు. 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా