రోహిత్ ఎంతో పృథ్విషా కూడా అంతే: ధావన్ సంచలనం

By Arun Kumar PFirst Published May 16, 2019, 5:20 PM IST
Highlights

ప్రపంచ కప్ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఓపెనింగ్ పాట్నర్ రోహిత్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు  చేశాడు. అందరు అనుకుంటున్నట్లు తామిద్దరి మధ్య ఎలాంటి ప్రత్యేకమైన అనుబంధం లేదని  ధావన్ అన్నాడు. తాను రోహిత్ తో కలిసి ఎలా ఆడతానో... పృథ్విషా తో కలిసి కూడా అలాగే ఆడతానన్నాడు. జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయిస్తే ఏ ఆటగాడితోనైనా ఓపెనర్ గా బరిలోకి దిగడానికి సిద్దమేనని ధావన్ పేర్కొన్నాడు. 

ఇంగ్లాండ్ లో జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.అయితే టీమిండియాను ఎప్పటినుండో మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తున్న విషయం  తెలిసిందే. టాప్ ఆర్డర్ విఫలమైందంటే చాలు మిడిల్ ఆర్డర్ జట్టును ఆదుకుని పరుగులు రాబట్టడంతో విఫలమవుతోంది. అందువల్ల భారత జట్టు గెలుపోటములను టాప్ ఆర్డరే నిర్ణయిస్తోంది.అందువల్ల భారత ఓపెనింగ్ జోడీ ఈ వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తుందన్న దానిపైనే అందరి చూపు వుంది. ఈ నేపథ్యంలో  ధావన్ మాటలు కాస్త ఆందోళనను కలిగిస్తున్నాయి. 

 రోహిత్-ధావన్ ల మధ్య  మంచి సమన్వయం వుండటంతో టాప్ ఓపెనింగ్ జోడీగా పేరుతెచ్చుకున్నారు. వీరిద్దరు ఒకరి ఆటతీరును ఒకరు అర్థం చేసుకుని మంచి అండర్‌స్టాండిగ్ తో క్రీజులో సౌకర్యవంతంగా కదులుతారు. అలాంటింది ధావన్ తాను రోహిత్, పృథ్విషాలతో ఒకేలా ఆడతానంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

'' రోహిత్ కేవలం ఓపెనింగ్ పాట్నర్ మాత్రమే...లైఫ్ పాట్నర్(భార్య) కాదు. అతడితో నేను ఎప్పుడూ టచ్ లో వుండాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి  ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నాం కాబట్టి అతడి గురించి నాకు తెలుసు. అతడి గురించి ప్రత్యేకంగా నేను చేయాల్సిందేమీ లేదు. రోహిత్ తో ఎలా కలిసి ఆడతానో పృథ్విషా తో కూడా కలిసి అలాగే ఆడతా. అవతలి వారు ఎవరైనా బాగా బ్యాటింగ్ చేస్తుంటే మద్దతుగా నిలుస్తా'' అని ధావన్ అన్నాడు. 

click me!