బిసిసిఐ త్రీ డైమెన్షన్ ప్లేయర్స్ కూడా అతడితో సరితూగలేరు: సెహ్వాగ్

By Arun Kumar PFirst Published May 16, 2019, 3:13 PM IST
Highlights

టీమిండియా చరిత్రలో హిట్టింగ్  అన్న పదాన్ని చేర్చిన ఆటగాడు వీరేంద్ర సేహ్వగ్. భారత జట్టు  తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి  మొదటి  బంతినుండి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేవాడు. అలాంటి ఈ మాజీ హిట్టర్ ని మరో ఆటగాడి బ్యాటింగ్ నచ్చిందంటే అతడెంత దూకుడుగా ఆడతాడో అర్థం చేసుకోవచ్చు. సెహ్వాగ్ చేత ప్రశంసలను అందుకున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా, ముంబై  ఇండియన్స్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. 
 
మరికొద్దిరోజుల్లో ఇగ్లాండ్ వేదికన ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్ గురించి సెహ్వాగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే హర్దిక్ పాండ్యా ను తన పొగడ్తలతో ఆకాశానికెత్తాడు. ఐపిఎల్ సీజన్ 12 లో తన హిట్టింగ్ బ్యాటింగ్ తోనే కాదు, బౌలింగ్, ఫీల్డింగ్ లతో పాండ్యా ఆకట్టుకున్నాడు. ఇలా ముంబై ఇండియన్స్ ని విజేతగా నిలిపడం కోసం పాండ్యా ఆల రౌండర్ గా అద్భుతంగా పోరాడాడు. దీంతో  సెహ్వాగ్ వంటి లెజెండరీ క్రికెటర్ల  చేత ప్రశంసలను అందుకుంటున్నాడు. 

సెహ్వాగ్ పాండ్యా ప్రతిభ గురించి  మాట్లాడుతూ...'' ప్రస్తుతం భారత జట్టులో  హర్దిక్ పాండ్యాను మించిన ఆటగాడెవరూ లేరు. కనీసం అతడి ప్రతిభకు దరిదాపుల్లో కూడా ఏ ఆటగాడు వున్నట్లు కనిపించడం లేదు. బిసిసిఐ త్రీ డైమెన్షన్ ప్లేయర్స్ లో ఎవరు కూడా పాండ్యాతో సరితూగే స్థాయిలో లేరు. అలా వుంటే నిషేధం తర్వాత అతడు మళ్లీ జట్టులోకి వచ్చేవాడే  కాదు'' అని అన్నారు. 

ఈ ఐపీఎల్‌ 12లో పాండ్యా ముంబై ఇండియన్స్‌ తరపున 16 మ్యాచులాడి 191.42 స్ట్రెక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. అలాగే బంతితోనూ రాణించి 14 వికెట్లను పడగొట్టాడు. దీంతో అతడు ఇదే ఫామ్ నుమ కొనసాగించి వరల్డ్ కప్ టోర్నీలో కూడా రాణిస్తాడన్న నమ్మకాన్ని సెహ్వాగ్ వ్యక్తం చేశాడు. 
 
click me!