రజినీకాంత్ హీరోయిన్లతో ఆడిపాడనున్న గబ్బర్.. ధావన్ బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు

Published : Oct 11, 2022, 06:02 PM ISTUpdated : Oct 11, 2022, 06:04 PM IST
రజినీకాంత్ హీరోయిన్లతో ఆడిపాడనున్న గబ్బర్.. ధావన్ బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు

సారాంశం

Shikhar Dhawan Bollywood Entry: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు సారథిగా వ్యవహరిస్తున్న టీమిండియా సారథి శిఖర్ ధావన్ త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్స్ వెలువడ్డాయి. 

టీమిండియా ఓపెనర్, దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ త్వరలోనే  బాలీవుడ్ తెరపై  మెరవనున్నాడు.   సూపర్ స్టార్ రజినీకాంత్ తో హీరోయిన్లుగా చేసిన హ్యూమా ఖురేషి (కాలా), సోనాక్షి సిన్హా (లింగ)లతో కలిసి అతడు చిందులేయబోతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి  నటిస్తున్న ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ధావన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు చిత్రబృందం  ఆసక్తికర అప్డేట్ తో గబ్బర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధావన్.. హ్యూమా ఖురేషితో కలిసి డాన్స్ చేస్తున్న సీన్స్ కు సంబంధించిన ఫోటోలను  ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. చివరికి మేం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని అర్థం వచ్చేలా.. ‘ఫైనల్లీ  క్యాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్’ అని రాసుకొస్తూ ధావన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.  

అధిక బరువు ఉండే ఆడవాళ్లు ఎదుర్కునే సమస్యల గురించి (తెలుగులో  అనుష్క నటించిన జీరో సైజ్ వంటిది) సున్నితంగా ప్రస్తావిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు సత్రమ్ రమణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో జహీర్ ఇక్బాల్, మహత్ రాఘవేంద్ర వంటి స్టార్స్ కూడా ఉన్నారు. 

 

గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న విడుదల కానున్నట్టు చిత్ర బృందం  పేర్కొంది. రాజశ్రీ త్రివేది (ఖురేషి), సైరా ఖన్నా (సోనాక్షి) లు  ఈ పాత్రల కోసం బరువు పెరిగి మరీ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. 

ఇక ఈ సినిమా గురించి ధావన్ స్పందిస్తూ.. ‘ఒక క్రీడాకారుడిగా దేశానికి ఆడుతున్నప్పుడు ఒక అథ్లెట్ కు బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయితే దాన్నుంచి సేద తీరడానికి నాకు సినిమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సినిమా కథ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కథ విన్నాకే నేను ఈ సినిమా చేస్తానని అంగీకరించాను. ఇది నా మీద చాలా ప్రభావం చూపింది. సినిమాలో అంతర్లీనంగా ఒక మంచి సందేశముంది. యువతీ యువకులకు ఆ సందేశం ఎంతో  ఉపకరిస్తుందని నేను నమ్ముతున్నా..’ అని తెలిపాడు. 

 

 


 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?